ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ పర్యటనలో కలకలం రేగింది. సాయంత్రం పర్యటన ముగించుకున్న సీఎం కిరణ్... విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు స్పైస్ జెట్ విమానంలో బయలుదేరారు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగానే... ఇద్దరు ప్రయాణికులు అకస్మాత్తుగా కిందకు దిగారు. దీంతో అనుమానం వచ్చిన విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.  అయితే కిందకు దిగిన ఇద్దరిలో ఒకరికి ఆస్తమా ఉన్నట్టు గుర్తించారు. ఆయనకు గుండెపోటు రావడంతో... మరో వ్యక్తి తోడుగా వచ్చినట్టు భద్రతా సిబ్బంది గుర్తించారు. అయితే మరో వ్యక్తి మాత్రం మాత్రం విమానంలోనే ఉండిపోయారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం కావడం వల్లనే ముందు జాగ్రత్త చర్యగా వివరాలు సేకరించామని, దీనిపై ఎలాంటి అపోహలు వద్దని విశాఖ నార్త్ ఏసీపీ బర్ల ప్రసాదరావు తెలిపారు. దీంతో సీఎం కిరణ్ ప్రయాణించిన విమానం సుమారు అరగంటపాటు ఆలస్యంగా బయలుదేరి హైదరాబాద్ చేరుకుంది. అయితే గుండెపోటు వచ్చిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: