అత్యాచార నిరోధక బిల్లుపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. విపక్షాలు నుంచి తీవ్ర స్థాయిలో వచ్చిన వత్తిళ్లకు తలొచ్చింది. సెక్స్ కు అర్హత వయస్సును 16సంవత్సరాలకు కుదించిన కేంద్రం ఇప్పుడు దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకు మార్చింది. అదే విధంగా స్త్రీలకు మానసికంగా వేధించే ఇతర చర్యలకు సంబంధించిన కఠిన నిబంధనలు కూడా సడలించింది. ఢిల్లీ అత్యాచార ఘటన నేపథ్యంలో గత నెల 3న అర్డినెన్స్ ను జారీ చేయడానికి ముందు వరకూ ఐసిపి కింద సెక్స్ అర్హత వయస్సు 16సంవత్సరాలుగానే ఉండేది. కాగా ఆ ఆర్డినెన్స్ ద్వారా శృంగార అర్హత వయస్సును కేంద్రం 18సంవత్సరాలకు పెంచింది. కాగా తాజాగా ప్రతిపాధించిన నేరచట్ట సవరణ బిల్లులో మళ్లీ ఈ అర్హత వయస్సును 16ఏళ్లకు తగ్గించింది. అయితే దీనిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో తన నిర్ణయాన్ని కేంద్రం మార్చుకుంది. ఇందుకు సంబంధించిన కొన్నికఠిన నిబంధనలు ప్రతిపాధించింది. కాగా సెక్స్ అర్హత వయస్సును 18సంవత్సరాలనుంచి తగ్గించడానికి వీలులేదని బిజెపి, ఎస్పీ తదితర పార్టీలు పట్టుబట్టాయి. వివాహ వయస్సు 18సంవత్సరాలున్నప్పుడు సెక్స్ అర్హత వయస్సును 16సంవత్సరాలకు తగ్గించడం అర్ధరహితమని పార్టీలు వాదించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: