కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. జూన్ 3వ తేదీతో కర్ణాటక శాసనసభ పదవీకాలం ముగియనుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి విఎస్ సంపత్ ప్రకటించారు. మొత్తం 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఏప్రిల్ 17, నామినేషన్ల పరిశీలనకు ఏప్రిల్ 18, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 20. మే 5న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. తర్వాత 8న ఓట్లు లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపారు. మొత్తం 4.18 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఈసీ తెలిపింది. రాష్ట్రంలో దాదాపు అందరికీ ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. మొత్తం 50,446 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: