పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన ఎమ్మెల్యేలపై చర్యలకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ... రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గీత దాటిన ఎమ్మెల్యేలపై ఆజాద్ కు ఫిర్యాదు చేశారు. పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి వివరాలను బొత్స సత్యనారాయణ... ఆజాద్‌కు నివేదిక రూపంలో అందజేశారు. పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఆజాద్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకమాండ్ ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆజాద్, బొత్స సత్యనారాయణ భేటీలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్టు తెలుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: