హోలీ పండుగ వచ్చిందంటే వయస్సుతో పనిలేకుండా, కుల,మతాలకు అతీతంగా మహిళలు, పురుషులు అనందాలు పంచుకుంటారు. రంగులు చల్లుకుంటూ ఎంతో సంబరంగా ఆడుకుంటారు. ఉదయం లేచిన నుండి 11గంటల వరకు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ అంటే రంగులు, గాఢమైన ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ. పసుపుపచ్చ కలర్ తో నీటిని తయారు చేసుకొని కనిపించిన మిత్రులను రంగుల్లో ముంచెత్తడం జరుగుతుంది. కొత్త పూల రంగుల్లో తడిసిముద్దయిపోవడం జరుగుతుంది. అయితే చల్లుకున్న ఆ రంగులు కొన్ని రోజుల పాటు ఒంటిమీదనుండి పూర్తిగా పోవు. ఇటువంటి రంగులు తీపిగుర్తులుగా నిలిచిపోతాయి. వయస్సుతో పనిలేకుండా అన్ని వయస్సుల వారు హోలీని ఆడుకుంటారు. కాగా గతంలో పకృతి సహజంగా తయారు చేసుకున్న రంగులు క్రమంగా తగ్గిపోతున్నాయి. బావుల వద్దకు వెళ్లి గోగు పూలు తీసుకొచ్చి ఎండబెట్టి తర్వాత ఎండిన పూతను మెత్తగా దంచి నీటితో కలిపి రంగులను తయారు చేసుకునేవారు. ఫలితంగా ఇటువంటి కలర్స్ తో ఎటువంటి చెడుప్రభావం ఉండదు. గోగుపూలతో చేసిన కలర్ కంటిలో పడిన, చెవుల్లో పడిన ఎటువంటి ప్రమాదం ఉండదు. కాగా ఇప్పుడు హోలీ ఆడేవారిలో ఓపిక తగ్గిపోయింది. దుకాణాల్లో అందుబాటులో ఉండేటువంటి కలర్స్ ను నీటితో కలిపి నేడు రంగులు చల్లుకుంటూ హోలీని ఆడుకుంటున్నారు. ఒకవేళ ఇటువంటి కలర్ కంటిలోగాని, చెవిలో గాని వెళితే ప్రమాదంగానే ఉంటుంది. అందుకే కొంత బాధకు భరించి అయిన సరే గోగుపూలతో తయారు చేసిన కలర్ నీటితో హోలీ పండుగను జరుపుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: