శ్రీలంకలో తమిళలు హక్కులకు రక్షణ లేదంటూ జరుగుతున్న ఆందోళన ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లపైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం చెన్నైలో మొత్తం 10 మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే చెన్నైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లకు అనుమతి ఇచ్చేది లేదని, శ్రీలంక క్రికెటర్లు ఎవరూ తమిళనాడులో అడుగుపెట్టడానికి వీలు లేదని తమిళనాడు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. జయలలిత హెచ్చరికల నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా స్పందించింది. ఐపీఎల్ మ్యాచ్ లు యధాతధంగా జరుగుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. శ్రీలంక తమిళుల సమస్య ఇంకా చల్లారలేదని స్థానిక ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని... అందుకే శ్రీలంక ఆటగాళ్ళను చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ ల్లో ఆడించవద్దని తొమ్మిది ఫ్రాంచైజీలకూ సూచించామని శుక్లా చెప్పారు. ఆ పది మ్యాచ్ లలో శ్రీలంక ఆటగాళ్ళు పాల్గొనరని శుక్లా స్పష్టం చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: