వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్నంత మాత్రాన రాజకీయాలు చేయకూడదని రూల్ ఉందా అని అంబటి ప్రశ్నించారు. జగన్ కేవలం విచారణలో ఉన్న ఖైదీ మాత్రమేనని, శిక్ష పడిన ఖైదీ కాదన్నారు. ఇది తెలియని కొందరు ఆయన జైల్లోంచి రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారని మండిపడ్డారు. జగన్ ఎందుకు రాజకీయాలు చేయకూడదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జగన్ జైలు నుంచే రాజకీయాలు చేస్తారు, చేసి చూపిస్తారనంటూ అంబటి వ్యాఖ్యానించారు. జగన్ ను ఎవరైనా కలువవచ్చు, మాట్లాడవచ్చు కాదని ఎవరైనా నిరూపిస్తారా? అని సవాల్ చేశారు. అదే సమయంలో జగన్ ను జైల్లోనే ఉంచేందుకు కుట్ర జరుగుతోందని అంబటి ఆరోపించారు. ఆనాడు వైఎస్ చెబితేనే సంతకాలు చేశామంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఓ న్యాయం, సబితా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులకు మరో న్యాయమా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ చెబితే సంతకాలు పెట్టామన్న మంత్రులు బుద్ది లేక పెట్టారా? లేక బుద్ధి తక్కువై పెట్టారా? అని అంబటి ప్రశ్నించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: