తెలంగాణ విషయంలో అధిష్ఠానానికి ధిక్కార స్వరం వినిపించడంలో మంత్రి జానా రెడ్డిది ప్రత్యేకమైన శైలి. ఈయన ఏదీ సూటిగా చెప్పరని ప్రతీతి. అలాంటి విలక్షణ రాజకీయ నేతను నేడు టీడీపీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రాములు, రావుల చంద్రశేఖర్ లు ఆయనతో సమావేశం అయ్యారు.   ఈ సందర్భంగా తమ తమ నియోజక వర్గాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ జానారెడ్డిని కలిసిన ఆ ఎమ్మెల్యేలు ఆయనతో తెలంగాణ విషయమై చర్చించారు. ఆ సమయంలో మంత్రి నివాసానికి కేకే కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి నేతలు కొత్త పార్టీ పెడితే టీడీపీ, కాంగ్రెస్ నుంచి భారీ సంఖ్యలో చేరతారని టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఈ ప్రతిపాదనకు స్పందించిన జానా.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఒకవేళ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వకపోతే, ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: