ఓవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ళ చిన్నారిపై అత్యంత దారుణమైన రీతిలో అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ  ఆందోళనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే.   నిర్భయ గ్యాంగ్ రేప్ మొదలుకొని రాజదానిలో ఐదేళ్ళ పసిప్రాయాన్ని కిరాతకంగా  గొంతు నులుముతూ, మర్మాంగంలో కొవ్వొత్తులతో, మూడు రోజులుగా హింసిస్తూ బ్రతుకును ఛిధ్రం చేసిన వారిని అరెస్టు చేయకపోగా అత్యాచారానికి గురైన బాధితకుటుంబాలు పోలీసులను ఆశ్రయిస్తే వారికి ఎదురైయ్యే వ్యంగ్యమైన మాటలతో పోలీసులు వేదించిన సంగతీ మనకు తెలిసిందే. ఈ విషాధకర వరస ఘటనలు మన భారత మహిళలను భయాందళనకు గురిచేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా  పొలంలో ఉన్న తన చిన్నాన్నకు భోజనం తీసుకెళ్తున్న చిన్నారిపై  అత్యాచారం జరిగిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని కెపిపాలెంలో  చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం  తన బాబాయికు భోజనం తీసుకెళ్తుండగా అదే గ్రామానికి చెందిన పూర్ణచందర్ రావు అనే యువకుడు ద్విచక్రవాహనంతో ఢికొట్టి పడిపోయిన చిన్నారిని సమీపంలోని ఒక తోటలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు.  జరిగిన విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసుకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మైరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు.   ఇలాంటి వరుస సంఘటనలతో ఢిల్లీ నుండి గల్లీ దాకా మహిళలు  భయాందోళనకు గురవుతున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, వేదింపులలకు పాల్పడే వారిపై మన పోలీసులు,  ప్రభుత్వాలు, న్యాయస్థానాలు సరైన శిక్షలు వేయకపోవడం మరి రెచ్చిపోతున్నారని మహిళాసంఘాలు వాటిపై స్పంధిచి పోరాటం చేస్తే కాని మన ప్రభుత్వం మేల్కోకోకుండ ఉండటం శోచనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: