ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై కౄరంగా అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలను నీలి చిత్రాల కథానాయిక సన్నీ లియోన్ ఖండించింది. దేశ రాజధానిలో ఐదేళ్ల బాలికపై కౄరంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కోర్టులో పిటీషన్ దాఖలు అయింది. ఈ నేపధ్యంలోనే నీలి చిత్రాల ప్రభావం కూడా యువతపై ప్రబావం చూపుతున్నట్లు పేర్కొంటూ నీలి చిత్రాలను ప్రసరించే వెబ్ సైట్లను నిషేదించాలంటూ సుప్రీం కోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

దీనిపై ఫోర్న్ తార స్పందిస్తూ వారు మధ్యం మత్తులో ఉండి మానసికంగా, అనారోగ్యంతో ఉండడం వల్లే అలాంటి పాశవిక చర్యకు పాల్పడ్డారని ఒక టీవీ చానల్ తో తన అభిప్రాయం వ్యక్తం చేసింది.  పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం విధించడం సరికాదని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అలాంటి వారిని చికిత్స ద్వారా దారిలో పెట్టడానికి పరిష్కారం కనుగొనాలని తెలిపింది.

తాము మద్యం తాగి మొబైల్ లో నీలి చిత్రాలను చూసిన తర్వాతే చిన్నారిని తీసుకొచ్చి అత్యాచారం చేశామని ఢిల్లీ అత్యాచార కేసు నిందితులు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో నీలిచిత్రాలు హానికరం కాదంటూ సన్నీలియోన్ నిర్వచనం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: