కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలనలో కొంతమంది మంత్రుల లక్షల, కోట్ల రూపాయిల కుంభకోణాలు బయట పడ్డవి. రాష్ట్రంలో కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంత మంది రాజకీయనాయకులు మద్యం సిండికేట్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. కొంత మంది మంత్రుల మీద సుప్రీం కోర్టు నుండి నోటీసులు వచ్చాయి. మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మద్యం కుంభకోణంలో యున్నారు. అయినా ఇంత వరకూ ఎవ్వరినీ అరెస్టు చేయలేదు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. మద్యం మాఫియాలో ఉన్న కొంత మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయిలు ముట్టినవి. అందుకు బాధ్యులైన అధికార్లను, రాజకీయ నాయకులను అందరినీ జైళ్ళకి పంపాల్సి ఉంది. కానీ, చేతగాని, అవినీతి ప్రభుత్వం వారిని కాపాడుకుంటూ వస్తుంది. ఇంకా మంత్రులకు న్యాయసహాయం క్రింది ప్రజల సొమ్మును ఖర్చు చేస్తుంది. ఇది ఎంత వరకూ సమంజసమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. భారత దేశ వ్యాప్తంగా 20 రాష్ర్టాలలో విద్యుత్ శక్తి లేక, గ్రిడ్ లు పనిచేయక 60 కోట్ల ప్రజలు అంధకారములో మగ్గుచున్నారు. అసమర్థత పాలన ముందు చూపు లేకపోవటము వలన దేశానికి వేల కోట్ల రూపాయలు నష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని దేశ ప్రజలు భరించాలసిందే. ఈ నష్టానికి ఎవ్వరు బాధ్యత వహిస్తారు.? ఇక మన రాష్ట్రంలో ఎప్పుడూ విద్యుత్ సంక్షోభం ఉంటూనే ఉంది. విద్యుత్ లేకపోతే ఏ పని జరగదు. అట్లాంటింది విద్యుత్ కొరత లేకుండా ఏనాడు చర్యలు తీసుకోలేదంటే, ముమ్మాటికీ ఈ ప్రభుత్వానిది అసమర్థ పాలనే. సమస్యలు అన్నిటికి ఈ ప్రభుత్వానిదే బాద్యత. ఇలాంటి చేతకాని దద్దమ్మ పరిపాలనను అంతం చేయాలని, స్వచ్ఛమైన పాలన, నీతివంతమైన పాలన, జవాబుదారి పాలన నిస్వార్థ పాలన రావాలి. దేశం అభివృద్ధి చెందాలని, విద్యుత్ కొరత లేకుండా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దుర్మార్గపు పాలనను అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ పాలన ఇంకా 20 సంవత్సరాల దాక రాకుండా ఉంటే దేశం బాగు పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీరమై ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నంగా తయారు అయినవి. ఇంజనీరింగ్ పట్టబద్రులు, పిజి ఇంజనీరింగ్ పట్టభద్రులు సంవత్సరానికి లక్షా యాభై వేల మంది నిరుద్యోగులు తయారు అవుతున్నారు. చదివి అప్పులు పాలై కుటుంబాలు జీవనం సాగించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో నూటికి 65 శాతం మంది ఆధార పడే వ్యవసాయ రంగం పూర్తిగా దివాళా తీసింది. నిత్యావసర వస్తువుల రేట్లు 80 శాతం పెంచారు. వ్యవసాయ ఉత్పత్తులకు 20 శాతం కూడా రేట్లు పెంచకపోవడంతో వ్యవసాయం పూర్తిగా పతనమైనది. అన్ని రంగాలను భ్రస్టు పట్టించింది ఈ ప్రభుత్వమే.  రాబోయే రోజులలో మూడు పూటలా తిండి 70 శాతం ప్రజానికానికి దొరకకుండా అలమటించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికైనా సమస్యలు అన్నిటిని అర్థం చేసుకొని ప్రభుత్వం చర్యలు చేపట్టక పోతే ప్రజల ఆగ్రహంతో మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీలు, అధికార యంత్రాంగంపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం జాగ్రత్త పడాలని ప్రజలు ముందుగానే హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త..! 

మరింత సమాచారం తెలుసుకోండి: