ఆహార భద్రత చట్టం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు అంశాలపై జరుగుతున్న చర్చలో ఈ అంశం కూడా ప్రధానంగా చోటుచేసుకుంది. దేశంలో ప్రస్తుతం ఉన్న సుమారు 115 కోట్ల మందికి రాష్ట్రంలో ఉన్న ఎనిమిది కోట్ల మందికి ఈ చట్టాన్ని వర్తింపచేస్తారా లేక దారిద్రరేఖకు దిగువున, ఎగువున ఉన్న వారికి అని విడదీస్తారా అనే దానిపై కేంధ్రం ఒక నిర్ణయానికి రాలేదు. ఎవరికి ఎలా ఈ చట్టం ద్వారా ఆహారభద్రత కల్పింస్తారనేది దానిపై ఎంతమందికి ఆహారం ఇస్తారో సమయమే చెబుతుంది. అయిన దేశంలో పరిస్థితి ఎలా ఉన్న రాష్ట్రంలో మాత్రం మొత్తం జనాభాలో 80 శాతం మందికి ప్రభుత్వం ఆహారభద్రత కల్పిస్తుందని గొప్పలు చెబుతున్నారు. రూపాయి కిలో బియ్యం పథకం ద్వారా అందరికి ఆహారంఅందిస్తున్నామని చెబుతున్న పాలకులు తిండి తినటానికి ఒక్క బియ్యం మాత్రమే సరిపోదని భావించి మిగతా వస్తువులు గాలికొదిలేసింది. ఒక రూపాయి కిలో బియ్యం పథకానికి పెద్దఎత్తున రాయితీతో కల్పిస్తూ 223 లక్షల దారిధ్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 39.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యన్ని అందజేస్తున్నారు. ఇలా మొత్తం జనాభాలో 80 శాతం మందికి ఆహారభద్రత కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంకా 27.72 లక్షల ధరఖాస్తులు కొత్తగా తెల్లరంగు రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ విధంగా ఏటా రేషన్ కార్డుల డిమాండ్ పెరగడంతో రానున్న రోజుల్లో ఆహార భద్రత ప్రతి పౌరునికి ఏ రకంగా ప్రభుత్వం కల్పిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: