కులతత్వం నిర్మూలించాలి.... కులం...మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం... ఇలాంటి పిలుపును తరుచుగా మన రాజకీయ నాయకులిస్తుంటారు. ప్రపంచం మారుతుంది. మనం మారాలి అని నత్యం భావించేవాళ్ళు మన రాష్ట్రంలో కూడా తక్కువేమి లేదు. అందులో మరీ ముఖ్యంగా రాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించిన మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఐటీ రంగాన్ని ప్రపంచానికి ప్రవేశపెట్టినట్లు ఫీల్ అయ్యేది ఆయనే మరి. అలాంటి నాయకుడు కూడా అధికారం కోసం కులాల వారిగా సమావేశంలో ఏర్పాటు చేసి అధికారంలోకొస్తే ఇది చేస్తాం, అది చేస్తామని గడిచిన కొద్ది రోజులుగా హామీలిచ్చుకుంటుపోతున్నారు. బీసీలకు 100 సీట్లు ఇస్తామని, ఎస్సీలకు కార్పొరేషన్ల ద్వారా ఆదుకుంటామని గొర్రె కాపర్లకు గొర్రెలిస్తామని, ఇలా ఒక్కటి కాదు అన్ని కులాల వారితో ఆయన సమావేశమవుతున్నురు. ఈ సందర్భంగా పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం, అధికారపార్టీ ప్రతినిధులు కూడా బాబు విమర్శలను తిప్పికొడుతూ బడుగు బలహీనవర్గాలకు అభ్యున్నతి కోసం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇలా అధికారం, ప్రధానప్రతిపక్ష పార్టీలు పోటిపడి కులాలు, కులవ్యవస్థ గురించి ప్రస్తావిస్తూనే పోటీపడి కులవ్యవస్థ గురించి మాట్లాడుతుండడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: