సినిమాలో వలె కుప్పిగంతులు వేస్తానంటే కుప్పకూలి నడుము విరుగుతుంది అంటూ సిఎం కిరణ్ ఇచ్చిన ఒక్క ఘలక్ టోటల్ చిరంజీవి ముఠా నే ఠారెత్తించింది. చిరంజీవే సిఎం కు అర్హుడు, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అంటూ ఆశగా ఎదిరి చూస్తున్నారు అంటూ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ తెగ రొదపెడితే గూబ గుయ్యిమనిపించారు ముఖ్యమంత్రి కిరణ్.

విద్యుత్ చార్జీలు పెంచితే ఏకంగా సిఎం కిరణ్ మనవాడు అని కూడా చూడకుండా కిరణ్ వ్యతిరేక గ్యాంగ్ నంతా పోగు చేసుకొని గ్యాంగ్ లీడర్ లెవల్లో గల్లా ఎగరేసి ఆజాద్ కు సిఎం తీరు బాగాలేదని లేఖ రాసి కుంపటి పెట్టాలను కున్నారు మెగాస్టార్. అంతటితో ఆగారా... కర్ణాటక గెలుపు హవా అంతా నాదే నంటూ ముఠామేస్త్రి లెవల్లో తన ముఠాతో  సిఎం కావాలన్న జపం తెగ చేయించారు.

ఇదేమన్నా ఆయన హీరోగా వెలిగిన సినిమా రంగమా... ఇక్కడ ఉన్నది రావుగోపాల్ రావు, సత్యనారాయణ వంటి విలన్లా... రాజకీయాల్లో పుట్టి, రాజకీయాల్లో ఎదిగి దక్కాముక్కీలు తిన్న కేటుగాళ్లు. అందుకే ఎగిరేదాకా చూసి గాల్లో ఉన్నాక రెక్కలు విరిచేసారు. దీంతో టపీమని నేలమీద పడి గిలగిల కొట్టుకుంటూ చేసిన తప్పుకు శిక్షచాలు కనీసం ప్రాణాలతోనైనా ఉంచండి అంటూ ప్రాధేయపడే స్థితికి చేరుకున్నాడు చిరంజీవి.

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటి బాగోతంపై ఒక్కసారిగా సిఎం కిరణ్ దృష్టి పెట్టారో లేదో, మృగరాజులా గాండ్రించిన చిరంజీవి పిల్లిలా మారి మియావ్.... అంటూ మోకరిల్లాడు. నిన్నటి దాకా వేస్ట్ సిఎం అన్న చిరంజీవి హఠాత్తుగా మాట మార్చి ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం లేదని కిరణ్ కు కితాబిచ్చారు. సిఎం కిరణ్ పనితీరు బేష్ అంటూ ఆకాశానికి ఎత్తారు.

మహిళా సంఘాలు, వడ్డీలేని రుణాలు చాలా సూపర్ అన్నారు, బంగారుతల్లి నా మనసును దోచింది అన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.  ఇలా ఒకటా రెండా కిరణ్ కూడా ఊహించనంత స్తాయిలో పొగిడేసి.... బాబ్బాబు... ప్లీజ్ నన్నా వదిలిపెట్టు అన్నంత పనిచేసారు.

ఏదైనా తగిలితే కాని తెలియదంటారు, అటు రాంచరణ్ దెబ్బ బొబ్బి కడుతుండగా, సిఎం దెబ్బ సివిల్ హాస్పిటల్ కు పంపేలా ఉండడంతో కొదమసింహం కాస్తా కొండదిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: