మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడా, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రేస్ లో కలపడం పెద్ద తప్పని బాధపడుతున్నారా, తన రాజకీయ అరగేంట్రానికి అహర్నిషలు కృషి చేసిన పరకాల ప్రభాకర్ వంటి మేధావుల మాటలను పెడచెవిన పెట్టినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నానని మధనపడుతున్నాడా, అన్నా... నీవెంట మేమున్నాం అంటూ తోడునీడగా  నీడలా నడిచిన నాగబాబు, పవణ్ కళ్యాణ్ మాటలను ఖాతరు చేయనందుకు ఒంటరి వాడినై పోయానని చింతపడుతున్నాడా... అంటే అవును అనే సమాధానమే చిరంజీవి సన్నిహితుల నుండి వినిపిస్థోంది.

ప్రజారాజ్యం ఏపిలో ఓ ప్రభంజనం సృష్టించింది, తొలి ప్రయత్నంలో 18 సీట్లు గెలువడం ఆషామాషి కాదు, నేడు రాష్ట్ర రాజకీయాలను చక్రతిప్పుతున్న 12 ఏళ్ల టిఆర్ఎస్ కంటే ఎంతో బెటర్, ఇప్పుడు అలాగే ఉంటే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏపికి ప్రజారాజ్యమే ప్రత్యామ్నాయమయ్యేదని రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం కూడా. పోని కాంగ్రేస్ లో చేరి చిరంజీవి వ్యక్తిగతంగానైనా బాగు పడ్డాడా అంటే, పోయిందాని ముందు వచ్చింది ఎంతో తక్కువ అంటున్నారు పరిశీలకులు.

ఇప్పుడు, అప్పుడు టిఆర్ఎస్ రాష్ట్రంలో ఓప్రాంతానికే పరిమితమైన పార్టీ, వైఎస్సార్ సిపి అలా కాకున్నా కూడా దాని ప్రభావం సీమాంధ్రకే పరిమితమైందని ఉప ఎన్నికలే రుజువు చేసాయి. టిడిపి రెండు కళ్ల సిద్దాంతంతో తెలంగాణలో తుడిచిపెట్టుకు పోయింది, సీమాంధ్రలోను డ్యామేజి అయి ఇక కోలుకోవడం లేదని సర్వేలే చెపుతున్నాయి. కాంగ్రేస్ అయితే కకావికలమై కానరాకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు చిరంజీవి కాదు కదా, కాంగ్రేస్ తరఫున ఏకంగా దేవుడు దిగివచ్చి పోటి చేసినా గెలవడం సాధ్యమయ్యే పనికాదు అన్న పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.

పోని పార్టీని కలిపినందుకు చిరంజీవిని కనీసం ఈరెండేళ్ల కోసం సిఎం ను చేసినా... చెడిపోయినా సుఖం దక్కింది అనుకునే వాడు. అలా కాక కేంద్రంలో నైనా మంచి పవర్ ఉన్న పోల్ట్ పోలియో దొరికిందా అంటే అదీలేదు, రాష్ట్రంలో తన వాటా కింద వచ్చిన రెండు మంత్రి పదవులు కూడా ప్రాధాన్యతలేనివే, పైగా ఆయన కుడిభుజం రాంచంద్రయ్యకే ఇప్పుడు కాంగ్రేస్ ఎసరు పెట్టబోతుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కనీసం రాబోయే ఎన్నికలకైనా చిరంజీవిని రాష్ట్రంలో పార్టీ సారథిగా ప్రకటించారా... అంటే అదీలేదు. పైగా ఇప్పుడయితే చిరంజీవిని అస్సలు పట్టించుకోవడం లేదు.

సర్వేలు, పార్టీ పరిస్థితులు పరిశీలిస్థే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రేస్ అధికారం లోకి వచ్చేలా లేదు. అంటే చిరంజీవి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పవర్ కట్టేనన్న మాట. ఒక వేళ పార్టీని కాంగ్రేస్ లో కలుపకుండా, బయట నుంచి మద్దతిచ్చినా కూడా ఇప్పుడు దక్కిన దానికంటే బెటర్ పదవులే దక్కేవని, ఎందుకంటే ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని బెదిరించైనా సాధించేవాడని అంటున్నవారే ఎక్కువ. ఇప్పుడు కాంగ్రేస్ తన భావాలకు విరుద్దంగా పోతోందని, సామాజిక న్యాయం కాంగ్రేస్ లో కొరవడిందని, సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పి ప్రజారాజ్యం ఒంటరిగా  రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగితే, కనీసం రాష్ట్రంలో పొత్తుల ఎత్తులలో అధిరానికి దగ్గరగానో, లేదా ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగానో అయ్యుండేదని రాజకీయ విశ్లేషకులే అంటున్నారు. ఇలా ఏవిధంగా చూసినా కూడా తన నిర్ణయం అయిన వారిని దూరం చేయడమే కాకుండా రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసిందనే చిరంజీవి బాధపడుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఇప్పుడు బయటకు రాలేనని, తిరిగి ప్రజారాజ్యం పునరుద్దరించలేని పరిస్థితులే ఉన్నాయని, ఇక ఎలా అంటూ చిరంజీవి గత కొన్ని రోజులుగా అంతర్మథనం చెందుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సినిమాల్లో వెలుగువెలిగి మెగాస్టార్ అయిన ఈ సుప్రీం హీరో భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: