ఇబ్బందులు మొదలైనా మెజారిటీ ప్రజలు ఇంకా ప్రధాని మోదీకి మద్దతుగా ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన రాజకీయాలను దేశ ప్రజ లే కాకుండా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ కారణంగా నే ఆయనను తక్కువగా అంచనా వేసుకున్నారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి. అంతేకాదు తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో, ఎప్పుడు వదిలేయాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి. 


ఈ రెండు లక్షణాలూ దండిగా ఉన్న వ్యక్తి కావడం వల్లనే భారతీయ జనతా పార్టీలో సాదాసీదా స్థానం నుంచి దేశం లోని అత్యున్నత పదవి అయిన ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగారు. ఈ ప్రస్థానంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు గురించి తెలుసుకుందాం. ఒకానొక దశలో బీజేపీ నాయకత్వం నిరాదరణకు గురైన నరేంద్ర మోదీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికై విశ్వహిందూ పరిషత్‌ అధినేత ప్రవీణ్‌ తొగాడియాపై ఆధారపడ్డారు. తొగాడియా సహకారంతో పాటు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ ఆశీస్సులతో గుజరాత్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 

ముఖ్యమంత్రి పదవిని సుస్థిరం చేసుకోవడంతో పాటు అంతిమ లక్ష్యమైన ప్రధానమంత్రి పదవిని అందుకోవడా నికై అప్పటి నుంచే వ్యూహరచన చేశారు. ప్రారంభంలో అండదండలు అందించిన ప్రవీణ్‌ తొగాడియాను ముఖ్యమంత్రి అయ్యాక దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఎల్‌.కె.ఆడ్వాణీతో వ్యవహరిస్తున్నట్టుగా అన్న మాట! గుజరాతీయుల మనసు గెల్చుకోవడానికి వ్యూహరచన చేస్తున్న సమయంలోనే గోద్రా మారణకాండ జరి గింది. దీన్ని ఒక అవకాశంగా మలచుకున్న నరేంద్ర మోదీ విజృంభించారు. తన చేతికి మట్టి అంటుకోకుండా చేయాల్సిందంతా చేశారు. 

గోద్రా మారణకాండకు ముందు కూడా గుజరాత్‌లో అయిదారు పర్యాయాలు మత కలహాలు జరిగాయి. ప్రతీ సం దర్భంలోనూ ముస్లింలది పైచేయి కావడం, హిందువులు ఎక్కువగా నష్టపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గోద్రా సంఘటనతో హిందువులలో భావోద్వేగాలు పరాకాష్ఠకు చేరాయి. అది గమనించిన నరేంద్ర మోదీ తన మదిలోని ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేయించారు. ఈ క్రమంలో తనకు ఎక్కడా రక్తపు మరక అంటకుండా జాగ్రత్త లు తీసుకున్నారు. ముస్లింలపై హద్దూ అదుపూ లేని మారణకాండ సాగింది. దీంతో గుజరాత్‌లోని సగటు హిందువు గుండెల్లో నరేంద్ర మోదీ కొలువు తీరాడు. 

నరేంద్ర మోదీని దేశమంతా ఈసడించుకున్నా, అమెరికా వంటి దేశం ముఖ్యమంత్రి హోదాలో కూడా మోదీకి వీసా ఇవ్వడానికి నిరాకరించినా, గుజరాతీయులు మాత్రం ఆయనను ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మోదీకి సహకరించిన ఆనాటి హోం మంత్రి హరేన్‌ పాండ్యా ఆ తర్వాత హత్యకు గురయ్యారు. తదనం తరం బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గుజరాత్‌ హోం మంత్రి అయ్యారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌం టర్‌ కేసులో అడ్డంగా దొరికిపోయిన అమిత్‌ షాను సీబీఐ అరెస్ట్‌ చేసి మూడు నెలల పాటు జైలులో పెట్టింది. ఈ దశలోనే తన మనసులోని మరో ప్లాన్‌ అమలుకు నరేంద్ర మోదీ పూనుకున్నారు. అదే ‘గుజరాత్‌ వెలిగిపోతోంది’ అనే నినాదం.
 
ముస్లింలు మినహా మిగతా వర్గాలన్నీ ఇతర రాష్ట్రాల‌కు చెందినవారి వద్ద నరేంద్ర మోదీ పాలనను అదే పనిగా పొగడటం మొదలయ్యింది. అదే సమయంలో మోదీ తరఫున కొంతమంది పూనుకుని దేశంలోని వివిధ పత్రికల లో ‘అచ్చే గుజరాత్‌’ అంటూ కథనాలు ప్రచురింపజేశారు. ఇంకే ముంది గుజరాత్‌ను భూతల స్వర్గంగా మార్చే సిన నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయితే దేశం కూడా వెలిగిపోతుందని దేశ ప్రజలు భావించడం మొదలయ్యిం ది. ఇలా ప్రతి దశలోనూ నరేంద్ర మోదీ ఒక వ్యూహం ప్రకారం పావులు కదుపుతూ ముందుకు సాగారు. 

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ఎలా ఉండేవారని అప్పట్లో అక్కడ పనిచేసిన ఒక ఐఏఎస్‌ అధి కారిని ప్రశ్నించగా, ‘‘మోదీ ఎంతో తెలివైనవాడు. తనకు ఏమి కావాలో ఆయన ఎప్పుడూ తన నోటితో చెప్పరు. కాగితంపై పెట్టరు. ఆయన తరఫున ఆయనకు నమ్మకమైన వ్యక్తి లేదా వ్యక్తులు మాత్రమే వ్యవహారాలు చక్కది ద్దుతారు. ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అప్పుడూ ఇప్పుడూ మోదీ ఎక్కువగా నమ్ముతున్న వ్యక్తి అమిత్‌ షా ఒక్కరే! మోదీకి షా అత్యంత విశ్వాసపాత్రుడు’’ అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: