గత సంవత్సరం దుమారం రేగిన అసహనం గురించి మనందరికీ తెలిసిందే. కవులు రచయితలు దగ్గర నుంచీ ఇన్ఫోసిస్ నారాయణ పూర్తి - టాటా దిగ్గజం రతన్ టాటా వరకూ అందరూ దీని పైన స్పందించారు . కొద్ది రోజుల క్రితం నుంచీ ఈ రచ్చ మళ్ళీ మొదటికి వచ్చేసింది. కర్ణాటక సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డు ని తిరస్కరిస్తున్నాను అని కన్నడ రచయిత జీ రాజశేఖర్ ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది.


దేశం తో పాటు రాష్ట్రం లో కూడా పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉంది అంటూ ఆయన ఆరోపణలు చేసి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఇటీవల ఆయనకు దక్కగా...ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ అక్కడి నుంచే పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. గత ఏడాది రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా రచయితలు - మేధావులు - సాహితీ ప్రముఖులు అప్పటివరకూ తమకు లభించిన అవార్డులను వాపస్ చేసేందుకు కారణాలుగా నిలిచిన అసహనపూరిత వాతావరణం హింసాత్మక ధోరణులు ఇప్పటికీ మారలేదని రాజశేఖర్ ఆరోపించారు. 



ఆ నాటి ప్రముఖుల యొక్క ఆవేదన కి తాను ఇప్పుడు సంఘీ భావం వ్యక్తం చేస్తూ ఈ పురస్కారం తిరస్కరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. విమర్సకులకి సమాధానాలు రావడం లేదు అనీ ఆయన కోప్పడుతున్నారు. మిత వాద శక్తులు నేటి రోజుల్లో విమర్శలు తట్టుకోలేక తమ గొంతు తొక్కే ప్రయత్నం చెయ్యడం బాధాకరం అన్నారు ఆయన.ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ ప్రాణాలను తీయటం దగ్గర నుంచి ఇటీవల రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో జరిగిన సంఘటనల వరకూ అన్నీ ఈ వాస్తవాన్నే నిరూపిస్తాయని రాజశేఖర్ గుర్తుచేశారు.



  రాజశేఖర్ రాసిన బహువచన భారత్ పుస్తకానికి ఈ అవార్డు ఇవ్వాలి అని అకాడమీ కోరుకుంది. సూటిగా రాజకీయ అంశాల మీద రాజశేఖర్ ఈ పుస్తకం లో ప్రస్తావన చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: