బీజేపీలో నరేంద్ర మోడీ జపం మరీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది. ఖాదీకి ఇన్నాళ్లూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న గాంధీ బొమ్మను తప్పించి ఇటీవల కేంద్ర ఖాదీ, గ్రామోద్యోగ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ ముఖచిత్రంతో క్యాలెండర్‌ ప్రచురించింది. కొన్నిరోజులుగా ఇది వివాదంగా మారింది. ప్రతిపక్షాలు గాంధీని పక్కకు పెట్టడంపై మండిపడుతున్నాయి. 

Image result for modi on khadi

ఈ విషయంలో విపక్షాలకు కౌంటర్ ఇవ్వబోయిన కమలం పార్టీ తానే ఇరుకునపడింది. మోడీ పట్ల విపరీతమైన భక్తి చూపించిన హర్యానా మంత్రి అనిల్‌ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాదీ నుంచి గాంధీ బొమ్మను తీసేశాకే అమ్మకాలు బాగా పెరిగాయట. నరేంద్రమోడీ బొమ్మ ముద్రించడం మొదలయ్యాక సేల్స్ విపరీతంగా పెరిగాయట. మోడీ బ్రాండ్ కు తిరుగులేదంటున్నాడాయన.

Image result for anil vij


అక్కడితో ఆగలేదు. నోట్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించినప్పటి నుంచి రూపాయి విలువ పతనమైందట. కరెన్సీపై నుంచి కూడా గాంధీ చిత్రాన్ని తీసేసి, మోడీ బొమ్మ ముద్రించే రోజు కూడా క్రమంగా వస్తుందట. ఏకంగా ఓ మంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం వివాదమైంది. అందులోనూ జాతిపిత గాంధీ పై కామెంట్స్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. 

Image result for modi on currency note


ఈ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన హర్యానా కమలం పార్టీ దిద్దుబాటు మొదలుపెట్టింది. అనిల్‌ విజ్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ చెప్పారు. ఈ వివాదం కాంగ్రెస్ నేతలకు బాగా హుషారు ఇచ్చేసింది. మోడీ గాంధీని క్రమంగా పక్కకు పెడుతూ వ్యక్తిగత ప్రచారానికి పెద్ద పీట వేస్తున్నాడని మండిపడ్డారు ఆ పార్టీ నేతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: