ప్రజాస్వామ్యంలో అధికార పక్షం తప్పులను ఎత్తి చూపించడం ప్రతిపక్షం హక్కు. హక్కే కాదు ప్రతిపక్షం ప్రధాన బాధ్యత కూడా. కానీ ప్రస్తుతం ఏపీలో అధికారపక్షం ప్రతిపక్షాన్ని తన బాధ్యత నెరేవర్చే అవకాశాలు కూడా ఇస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పర్యటనను కూడా చివరకు అధికార పక్షమే డిసైడ్ చేసేలా కనిపిస్తోంది.



రాజధాని ప్రాంతంలో ఇవాళ ( గురువారం ) జగన్ పర్యటించబోతున్నారు. రాజధాని రైతుల సమస్యలను సావకాశంగా పరిశీలించబోతున్నారు. ఐతే.. ఈ పర్యటనకు అడ్డుతగిలేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యాత్రకు అనుమతి కోసం వైసీపీ పెట్టుకున్న దరఖాస్తుపై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 




వైసీపీ ఇచ్చిన రూట్ మాప్ ప్రకారం తాము అనుమతి ఇవ్వబోమని పోలీసులు కచ్చితంగా చెబుతున్నారట. తాము చెప్పిన రూట్ లోనే జగన్ పర్యటన చేయాలని పోలీసులు ఆంక్షలు పెడుతుండడం వివాదానికి దారి తీస్తోంది. రాజధాని ప్రాంత రైతులను పరామర్శించడానికి వెళుతున్న జగన్ పై ఆంక్షలేమటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 



ముందుగా నిర్ణయించిన ప్రకారం జగన్ ఉదయం 9.30 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు నుంచి పర్యటన ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లింగాయపాలెం చేరుకుని బాధిత రైతులతో జగన్ మాట్లాడతారు. ఈ రూటు విషయంలో పోలీసులు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారనేది అంతుబట్టని విషయం. బహుశా ఆ ప్రాంతంలో సర్కారు వ్యతిరేకత ఎక్కువగా ఉందేమో. 



మరింత సమాచారం తెలుసుకోండి: