మంత్రి పార్థసారథికి మతిపోయింది, ఏకంగా ముఖ్యమంత్రి ఉన్నాయి బాబోయ్ తీసేయండి అంటూ మొత్తుకుంటుంటే ఎక్కడున్నాయి అంటూ పార్థసారథి కాస్థా గీతాబోద చేసేసరికి సిఎం కు చిర్రెక్కిందో లేదో తెలియదు కాని, ఆమాటలు విన్న ప్రతిఒక్కడు మంత్రికి మతిపోయిందని అంటున్నారు. ఇంతకీ ఆయన అన్నదేమిటి అంటే రాష్ట్రంలో ఒక్క బెల్టుషాపు కూడా లేదని.

సరే ఆయన చూస్థున్న శాఖలో ఆయనకు తెలియందేముంటుంది అని సరిపెట్టుకుందాం అనుకుంటే, పట్టుమని పదిగుడిసెలు లేని పల్లెటూరులో కూడా ఓ గుడిసెలో మద్యం దొరుకుతోంది, ఆ గుడిసెను బెల్టుషాపు అనాలా, లేక మంత్రిగారికి తెలియని మద్యం దుకాణం అనాలా....అన్నది ఆయనే చెప్పాలి. రాష్ట్రమంతటా బెల్టుషాపులు తొలగించాలంటూ ఉద్యమం చేస్థున్నవారికి కళ్లు దొబ్బాయి అనుకోవాలో కూడా ఎక్సయిజ్ మంత్రి పార్థసారథే చెప్పాలి.

బెల్టు షాపుల వల్ల ఇళ్లు గుల్లవుతున్నాయని గోడు పెడుతున్న మహిళలు, వాటిని అధికారంలోకి రాగానే తీసేస్థాం అంటున్న ప్రతిపక్షాలు, వాటికోసం పోరాట బట్టిన మద్యనియంత్రణా కమిటి, అప్పటి దాకా ఎందుకు ఇప్పుడే తీస్థాం అంటున్నముఖ్యమంత్రి ఇలా అందరు కళ్లులేని  వారికిందే ఆయనకు కనిపిస్థే ఎవరు మాత్రం ఏంచేస్థారు. కాని ఆయన విధులు నిర్వహిస్థున్న మంత్రిమండలి సారథి ముఖ్యమంత్రి కిరణ్ కూడా బెల్టుషాపులు నెలరోజుల్లోగా తీసేయండి అని ఆదేశించింది తన ఎక్సయిజ్ శాఖకే కదా, అప్పుడు ఈ మాట ఎందుకనలేదో అని  జనం గడ్డిపెడితే పార్థసారథి ఎక్కడికి పోతాడు అంటున్నారు జనం.

సరే ఆయన అన్న మాటల్లో అంత తప్పును వెతికి ఇంతగా దుమ్మెత్తిపోయాల్సిన అవసరం లేదనే వారున్నారు, కారణం ఆయన బెల్టుషాపులు రాష్ట్రంలో అధికారికంగా ఎక్కడా లేవు అన్నారు. ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజం. కాని అధికారికంగా ఉంటే అది బెల్టుషాపు ఎందుకవుతుంది, ఎంచక్కా ప్రభుత్వానికి కూడా ఆదాయం తెచ్చిపెట్టే వైన్స్ షాపు అవుతుంది కాని, అలాంటి వాటిని తీసేయమని ఎవరన్నా ఎందుకూరుకుంటారు, ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ఆయన ఎక్సయిజ్ మంత్రి ఎలా అయ్యారు అనుకుంటున్నారంతా.

మరింత సమాచారం తెలుసుకోండి: