జనం కోసం జగన్.. జగన్ కోసం జనం.. వాస్త‌వానికి జనం కోసం తపించే  ప్రజా నాయకుడు, సమకాలీన రాజకీయ నాయకుల్లో వైయస్ జగన్ ఒక్కడే అని అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.  రాజకీయాల్లో జయాపజయాలు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే జగన్ ని అందరు రాజకీయ నాయకుల కంటే ప్రత్యేకత తెచ్చిపెట్టింది. ఒక్కసారి జగన్ సభలకు వెళితే తెలు స్తుంది. ముఖ్యంగా పేదల కండ్లలో జగన్ని చూడగానే ఆనందం కనిపిస్తుంది. ప్రతి అవ్వా, అమ్మా మన రాజన్న బిడ్డ తన ఇంటికి వచ్చాడని సంబురపడ‌తారు. ప్రతి అక్కా చెల్లెమ్మ తన తోడబుట్టిన వాడే తనను పలకరించ డానికి వచ్చాడని మురిసిపోతారు.


ప్రతి అన్నా, తమ్ముడు తన తోడ బుట్టినవాడే తనను తోడుగా నిలబడడానికి వచ్చాడని భరోసాగా ఫీలవుతాడు. దీనికి కారణం జగన్ అంటే ఓ నమ్మకం, ఓ విశ్వసనీయత,  ధైర్యం, ఓ అండ...ఓ భరోసా..జగన్ మా మనిషి..మా కుటుంబంలోని వ్యక్తి అని తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ భావించడమే..తండ్రి  వైయస్ లాగానే జగన్ కు ఎలాంటి భేషజాలు చూపడు. పేదలంటే ఎంతో ప్రేమ. జగన్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అని, పెద్ద పొగరుబోతు అని, పెద్దల పట్ల మర్యాద చూపడు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు..కానీ జగన్ని జనంలోంచి చూస్తే మాత్రం ఓ ఇంటి కొడుకు, ఓ బాధ్యత గల సోదరుడులా కనిపిస్తాడు. అంతలా పేద ప్రజలతో మమేకం అవుతాడు. రాజ అంతఃపురం ల్లాంటి విలాసవంతమైన ప్యాలెస్ లలో సౌకర్యంగా జీవితం గడిపే జగన్ పేదల గుడిసెల్లో కూడా అంతే సౌకర్యంగా ఫీలవుతాడు.

బంగారు పళ్లెంలా కోరుకున్న తిండి తినగలిగే జగన్ పేదల గుడిసెల్లో వారు పెట్టే పచ్చడి మెతుకులు కూడా అంతే ఆప్యాయంగా తింటాడు..అందుకే జగన్ జనం కోసం పుట్టాడు అం టారు. ఎన్టీఆర్, వైయస్ ఆర్, కేసీఆర్ ల తర్వాత పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నిజమైన ప్రజా నాయ కుడు జగన్ మాత్రమే. జగన్ భారత రాజకీయాల్లోనే ఓ సరి కొత్త సంచలనం. పేదల పెన్నిధి, మహోన్నత నాయకుడు వైయస్సార్  వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు . 2004లో తొమ్మిదేళ్ల టీడీపీ పాలనకు చరమ గీతం పాడడంలో వైయస్ పాదయాత్ర ఎంత కీలక పాత్ర వహించిందో మనందరికీ తెలుసు.


అదే సమయంలో వైయస్ జగన్ రాష్ట్రమంతటా తిరిగి కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాల గురించి ప్రచారం చేస్తూ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించాడు. తండ్రి వైయస్ లాగానే పేద ప్రజల్లోకి చొచ్చుకుని పోవడం, హావభా వాలు అచ్చం తండ్రి లాగానే పోలి ఉండడం చూసి ప్రజలు జగన్ని మన వైయస్ బిడ్డ అని చెప్పుకుని మురిసి పోయారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,వైయస్ ఆర్ అభిమానుల కోరిక మేరకు జగన్ 2009 లో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి అఖండ విజయం సాధించాడు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే వైయస్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హఠాన్మరణంతో  జగన్ రాజకీయ జీవితం మలుపు తిరిగింది.

వైయస్ విధేయులైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ని సీఎం చేయాలని సంతకాలు పెట్టి అధిష్టానంకు వినతి పత్రం అందించారు..కానీ అధిష్టానం మాత్రం జగన్ కు అనుభవం లేదని భావించి సీనియర్ అయిన రోశయ్య కు అధికారం కట్టబెట్టింది..అయినా జగన్ చలించలేదు..అధికారం కన్నా ప్రజలే ముఖ్యం అనుకున్నా డు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ మరణాన్ని తట్టుకోలేక నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 600 గుండె లు ఆగిపోయాయి. వారి కుటుంబాలన్నీ తమ ఆప్తులను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయి.పేదలే తన కుటుంబంగా భావించే జగన్ ఓ పెద్ద కొడుకుగా  ఆయా కుటుంబాల వారిని ఓదార్చాల్సిన బాధ్యత తనకుం దని భావించాడు.


అందుకే వైయస్ మరణించిన పావురాల గుట్టలో సంతాప సభ వేదిక సాక్షిగా రాష్ట్రమంతా తిరిగి తన తండ్రి మర ణంతో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చి వారికి అండగా నిలబడతానని ప్రకటించాడు. అప్పటికే జనం లో జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ అధిష్టానం ఈ యాత్రను మరో విధంగా అర్థం చేసుకుంది. ఓదార్సు యాత్ర చేయద్దు. జిల్లా కేంద్రాలకు వారిని తీసుకువచ్చి ఆర్థిక సహాయం అందించమని సూచించింది. కానీ జగన్ మాత్రం  మాట తప్పడం, మడమ తిప్పడం మా వంశంలోనే లేదు. తన తండ్రి మరణంతో పెద్ద దిక్కులను కోల్పోయిన కుటుంబాల వారిని స్వయంగా ఓదార్చి ,అండగా నిలబడతానని చెప్పాడు. 

ఇక్కడే కాంగ్రెస్ అధిష్టానానికి, జగన్ కు మధ్య విభేదాలు మొదలయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని  కాదని జగన్ రాష్ట్రమంతటా ఓదార్పు యాత్ర చేపట్టి ఊరూరా తిరుగుతూ ఆయా కుటుం బాల వారి ఇంటికి వెళ్లి వారికి మనో ధైర్యాన్ని కల్పించి ,తగిన ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలబ డ్డాడు. ఓదార్పు యాత్రతో దాదాపు రెండున్నరేళ్లకు పైగా దాదాపు 70,000 కి.మీలు తిరుగుతూ జనంతో పూర్తిగా మమేకం అయ్యాడు  జగన్. ఇక్కడే ప్రజలు వైయస్ బిడ్డ జగన్ కు, ఇతర రాజకీయ నాయకులకు మధ్య తేడా ఏంటో అర్థం చేసుకోగలిగారు. 

ఓదార్పు యాత్రతో  జగన్ కు ప్రజల్లో మైలేజీ పెరగడంతో నాటి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష టీడీపీ పార్టీలు కూడా ఉలిక్కిపడ్డాయి. జగన్ ని కట్టడి చేసేందుకు అనేక వ్యూహాలు పన్నడం ఆరంభించాయి..దీంతో విసుగె త్తిన జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా  చేసి తండ్రి పేరుతో 2011లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఇక్కడే వైయస్ జగన్ రాజకీయ జీవితం కీలక మలుపు తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: