హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ఆశించినంత వేగంగా పూర్తికావడం లేదు. వాస్తవానికి ఏడాది క్రితమే ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికి ఒక్క రూట్ లో కూడా సర్వీసులు ప్రారంభం కాలేదు. తాజాగా 2018 జనవరి నాటికి మొదటి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించకున్నారు. 



ఐతే.. ఈ రైల్వే ప్రాజెక్టుపై కేసీఆర్ సర్కారు అంత సానుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. మొదటి నుంచి ఎల్ అండ్ టీ కంపెనీతో సత్సంబంధాలు లేవు. అందులోనూ లైన్ల క్రియరన్స్ వివాదం కొన్నాళ్లు పెండింగ్ లో పడేసింది. చివరకు హైదరాబాద్ మెట్రో పూర్తిస్తాయిలో ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. 



కానీ..అటు విజయవాడ మెట్రో వ్యవహారం జోరుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. విజయవాడ మెట్రో పనులు ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. పనులు ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు తాజా వెలగపూడిలోని సచివాలయంలో మెట్రో అత్యున్నత స్థాయి బృందం సమావేశమైంది. 


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్.టక్కర్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండి రామకృష్ణారెడ్డితో పాటు సీఆర్డీఏ, వి.ఎం.సి, రోడ్లు భవనాలు, పంచాయతిరాజ్, నీటిపారుదలశాఖ, పోలీసుశాఖ అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెలలో మెట్రో టెండర్లు తెరవనున్నారు. ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్న సంస్థతో మార్చి నెలలో ఒప్పందం కుదుర్చుకుని ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేయాలనేది మెట్రో అధికారుల ఆలోచన.



మరింత సమాచారం తెలుసుకోండి: