బెల్టు తీసుడే కాని చావబాదుడే అంటోంది ప్రభుత్వం. దీనికి కొత్త మద్యం పాలసీతో సిద్దమయింది, దానిని రేపోమాపో ప్రకటించి ఇక బాదడానికి రెడీ అయింది కిరణ్ సర్కారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లక్షన్నర కోట్లతో సమానంగా మద్యం నుంచి సంపాదిస్థోంది. అలాంటిది బెల్టుషాపులు తీసి బిచ్చమెత్తుకోమంటే ఎలా, అలా అని వాటిని తీయకపోతే ఓటర్లు ఎక్కువగా ఉన్న మహిళాలోకం నుంచి తిరుగుబాటు వచ్చి అసలు అధికారానికే ఎసరు వచ్చేలా ఉంది.

అందుకే బుర్రకు పనిచెప్పిన సిఎం కిరణ్ కుమార్ ఎట్టకేలకు బెల్టు తీస్థూనే ఇక అధికారికంగా చావబాదుతూ అధిక ఆదాయం పొందేందుకు పథకం వేసాడు. అందుకు తగ్గట్టుగా కొత్త మద్యం పాలసీ తయారు చేసారు. ఇక ఎక్కడా బెల్టుషాపులు ఉండవు, ఏ ఊళ్లోను చాటుమాటుగా మద్యం విక్రయాలు జరగవు, అంతా దర్జాగా ప్రభుత్వం అనుమతితోనే జరుగుతాయి. ఇక నుంచి ఆబెల్టు షాపులన్నీ పర్మిట్ రూములుగా మారుతున్నాయి. అంటే వాటి అనుమతి వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం, వాటిలో ఇప్పుడు జీరోలో అమ్ముడవుతున్న మద్యంతో ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం ఇక ఆ అమ్మకాల ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోబోతోంది.

షాపులకు, పర్మిట్ రూంలకు లిమిట్, నిబందనలు లేకుండా అడిగిన వెంటనే అనుమతి ఇవ్వాలని కొత్త పాలసీ తయారు చేసారు. 2011జనాబా లెక్కల ప్రకారం ఆయా ప్రాంతాలలో లైసెన్సు ఫీజులు ఉంటాయి. డిమాండ్ ఉన్న చోట పెండింగ్ లో ఉన్న షాపులను తరలిస్థారు. ఇలా ఇప్పుడు తక్కవైన 617 షాపులను తిరిగి పునరుద్దరించనున్నారు. ఇలా ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాలు, బార్ల ను అదికం చేస్థూ రూపొందించిన మద్యం కొత్త విదానం ఒకటి రెండు రోజుల్లో అమలయ్యేలా ఉత్తర్వులు వెలుబడనున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: