ఎంపీ కవితపై రైల్ రోకో కేసులో ఊరట :


తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలిలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. రైల్ రోకోలో భాగంగా నాడు కవితపై కేసు నమోదైన విషయం విదితమే.  కాగా ఈ రోజు ఎంపీ కవితపై నమోదైన రైల్ రోకో కేసును సికింద్రాబాద్ రైల్వే కోర్టు కొట్టివేసింది. రైల్ రోకో కేసులో భాగంగా కోర్టుకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎంపీ కవిత మండిపడ్డారు. అర్ధంలేని విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు సర్కారు పనితీరును మెచ్చుకుంటుంటే.. కొందరు పనిగట్టుకుని దుష్ర్పచారం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.


బిజెపీలో చేరి చిరు హీరోయిన్ :

రాజకీయాల్లోకి వచ్చిన మరో హీరోయిన్

బాలీవుడ్‌తో పాటు తెలుగు, దక్షిణాది సినిమాల్లో నటించిన రిమీ సేన్ బీజేపీలో చేరారు.   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా సమక్షంలో ఆమె పార్టీలోకి వచ్చారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అందరివాడులో హీరోయిన్‌గా నటించిన రిమి సేన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఆమె కమల దళంలో చేరారు. గతంలో అనేక హిందీ, బెంగాలీ, తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగులో నీ తోడు కావాలి సినిమాలో కూడా కనిపించారు. ధూమ్ వంటి సూపర్ హిట్ హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. రిమీ సేన్ స్వస్థలం పశ్చిమబెంగాల్. ముంబైకి మకాం మార్చి సినీ రంగంలో స్థిరపడ్డారు. 


తమ్ముడికి జై కొట్టిన మెగా బ్రదర్స్ :


ఈ నెల 26వ తేదీన విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టనున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనికి వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేఖంగా పవన్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పలువురు హీరోలు కూడా ముందుకు వచ్చారు. పవన్ ట్వీట్స్ కు హీరోలు సాయిధరమ్ తేజ్, నవదీప్, మంచు మనోజ్, సంపూర్ణేష్ బాబు, శివబాలాజీలు స్పందించారు. యువత ఉద్యమానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ అన్నయ్య పక్షం వహిస్తూ పవన్ ని చిన్న పిల్ల వాడిగా కొట్టి పడేసే నాగబాబు తాజాగా పవన్ కి మద్దతుగా ఉంటున్నట్టు తెలిపాడు. ప్రత్యేక హోదా సాధన ఆందోళన కోసం జనసేన తరపున పవన్ చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: