తమిళనాడుకు నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు  :


 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జల్లికట్టు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలవ్వాల్సిన జల్లికట్టు ఉత్సవాలకు అడ్డం లేకుండా పోయింది.  అంతే కాదు జల్లికట్టు వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జల్లికట్టు నిర్వహించాలని జరిగిన ఆందోళనలో హింస చోటు చేసుకుందని, అయినా మీరు శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు విఫలం అయ్యారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ ఉత్సవాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాల నిఘా ఉంచాలని, అలాగే ఉత్సవాల్లో పాల్గొనే ఎడ్లకు ముందుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కూడా చట్టంలో పేర్కొన్నారు. 


టివి నటిపై లైంగిక దాడి :

Kannada TV Actress files Molestation complaint against builder’s Son in Bengaluru

భారత దేశంలో మహిళలపై ఎమాత్రం భద్రత లేదని ఇప్పటికే ఎన్నో సంఘటనలు నిరూపించగా తాాజగా మరో సంఘటలన వెలుగులోకి వచ్చింది.  ఏకంగా సినీ నటిపై ఓ తాగుబోతు పబ్లిక్ గా లైంగిక దాడికి తెగబడటం సంచలనం రేపింది.  బెంగుళూరు లో  పీకలదాక మద్యం సేవించిన బిల్డర్ కుమారుడు అదే బార్ లో స్నేహితులతో కలిసి ఉన్న టీవీ నటిపై లైంగికదాడికి యత్నించిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనం రేపింది.  తరువాత నటి కబ్బన్ పార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇన్స్ స్పెక్టర్ నాగరాజ్ ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. వెంటన్ సీఐ బిల్డర్ శ్రీనివాస్ కు ఫోన్ చేసి చెప్పగా ఆయన పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి రాజీచేశారు. 


పాకిస్థాన్ లో ట్రంప్ ప్రకంపనలు :


ఉగ్రవాదంపై దాయాది తీరులో మార్పు కనిపిస్తోంది. జమ్మత్ఉద్- దవా చీఫ్ హఫీజ్ సయిాద్ హౌస్ అరెస్టు అయ్యాడు. జేయూడీ ప్రధాన కార్యాలయంలోనే లాహోర్ పోలీసులు నిర్బంధించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న అగ్రరాజ్య హెచ్చరికలతోనే నవాజ్ షరీఫ్ సర్కార్ అడుగు ముందుకేసింది.  ఫలా-ఇ-ఇన్సానియత ఫౌండేషన్‌, జమ్మత్- ఉద్‌-దవాలపై చర్యలు తీసుకోవాలని... వాటిని ఆర్నెల్ల పాటు వాచ్‌లిస్టులో ఉంచాలని జనవరి 27న పాకిస్థాన్‌ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యాంటీ టెర్రరిజం యాక్ట్‌ కింద సయీద్‌ను సోమవారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు.  హఫీజ్ సయిాద్ తో పాటు అబ్దుల్లా ఉబైద్‌, జాఫర్‌ ఇక్బాల్‌, అబ్దుర్‌ రెహ్మాన్‌ అబిద్‌, కాజీ కాషిఫ్‌ నియాజ్‌లను కూడా నిర్బంధించారు. అలాగే కార్యాలయంపై ఉన్న పార్టీ జెండాలన్నింటినీ పీకిపారేశారు. పాకిస్థాన్‌ జెండాలను ఎగురవేశారు.  మరోవైపు ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తన హౌస్ అరెస్ట్ పైన స్పందించాడు.దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కారణమని అంటున్నాడు.  


కాంగ్రెస్ఎస్పీ కూటమికి బిగ్ షాక్ :

యూపీ ఎన్నికల ప్రచారానికి సోనియా దూరం

పొత్తుతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జయభేరీ మోగించాలనుకున్న కాంగ్రెస్-సమాజ్ వాదీ(ఎస్పీ) కూటమికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోరని ఆ పార్టీ వర్గాలు మంగళవారం సంకేతాలిచ్చాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌.. కూటమి తరఫున ప్రచారం చేయబోనని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్లే సోనియా ప్రచారం నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. స్పష్టమైన కారణాలేవి తెలియరాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: