ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై షాకింగ్ కామెంట్లు చేశారు.. మన తెలుగువాళ్లు భారీ సంఖ్యలో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో వారి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడిందని చంద్రబాబు అన్నారు. అంతేకాదు.. అమెరికాలోని తెలుగువారి ఉద్యోగాల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందని నెల్లూరులో జరిగిన ఓ మీటింగ్ లో అన్నారు. 



ఉన్నపళంగా అమెరికాలో ఉద్యోగాలు తీసేయడం కరెక్టుకాదని చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో సోలార్ పరిశ్రమకు చెందిన శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఏపీ దూసుకుపోతోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గతంలో నెంబర్ టూలో ఉన్న ఏపీ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుందని అన్నారు. 



రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదని కొందరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు కామెంట్ చేశారు. భూములు ఇవ్వవద్దని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పరిశ్రమల కోసం ఇప్పుడు భూములు ఇవ్వకపోతే.. రేపు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: