త‌మిళ రాజ‌కీయాలు మ‌లుపులు మీద మ‌లుపులు తిరుగుతున్నాయి. చిన్న‌మ్మ‌మీద తిరుగుబావుటా ఎగిరేసిన ప‌న్నీర్ సెల్వం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే అర్థ‌రాత్రి స‌మ‌యంలో పోయెస్ గార్డెన్స్‌లో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించిన శ‌శిక‌ళ ...ఆ త‌ర్వాత పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో, అభిమానుల‌తో మాట్లాడారు. ప‌న్నీర్ సెల్వం డీఎంకే చేతిలో పావుగా మారాడ‌ని ఆరోపించారు. వారు ఆడ‌మ‌న్న‌ట్లుగా ఆడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Image result for panneerselvam

ప‌న్నీర్ సెల్వం చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాలే అని, అందులో ఎంత మాత్రం నిజం లేద‌న్నారు చిన్న‌మ్మ‌. రాజీనామా చేయాల్సిందిగా ఎవ‌రూ త‌న‌ను ఒత్తిడి చేయ‌లేద‌ని శ‌శిక‌ళ అన్నారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందున ప‌న్నీర్ సెల్వంను పార్టీ నుంచి పార్టీ స‌భ్య‌త్వాన్నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అన్నాడీఎంకే పార్టీ కార్య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలంతా ఒక్క కుటుంబంలా క‌లిసే ఉన్నామ‌న్నారు శ‌శిక‌ళ‌. పార్టీలో ఎలాంటి చీలిక రాలేద‌ని చెప్పారు. 

Image result for panneerselvam

ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటు త‌ర్వాత శ‌శిక‌ళ ఏర్పాటు చేసిన అత్య‌వ‌స‌ర స‌మావేశానికి 20 మంది మంత్రులు 80 మంది ఎమ్మెల్యేలు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. వారంతా చిన్న‌మ్మ వెంటే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ప‌న్నీర్ సెల్వం అన్న‌ట్లు ప్ర‌జ‌లు కోరుకుంటే త‌ను మ‌ళ్లీ సీఎం ప‌గ్గాలు చేప‌డ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ప‌న్నీర్ మ‌ళ్లీ గ‌ద్దెనెక్కాలంటే త‌ను మెజార్జీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

Image result for panneerselvam

ఇంత తొంద‌ర‌గా మార్పులు చేర్పులు చేయాల్సిన అవ‌స‌రం ఏముందంటూ ప్ర‌శ్నించారు ప‌న్నీర్ సెల్వం. త‌న‌పై శ‌శిక‌ళ వ‌ర్గం ఒత్తిడి  తెచ్చిందంటూ మ‌రోసారి ఆరోప‌ణ‌లు చేశారు. అమ్మ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు. జ‌య‌ల‌లిత త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని ఎవ‌రూ త‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌లేర‌న్నారు. అమ్మ త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి రెండు సార్లు ముఖ్య‌మంత్రిని చేశార‌ని గుర్తుకు చేసుకున్నారు. ఒక వేళ త‌మిళులు త‌న‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకుంటే త‌ప్ప‌కుండా ఆ బాధ్య‌త‌లు చేప‌డ‌తాన‌ని వెల్ల‌డించారు ప‌న్నీర్.



మొత్తానికి అమ్మ లేని లోటు అన్నాడీఎంకేలో చీలిక తీసుకొస్తుంద‌ని అయితే త‌ద‌నంత‌ర పరిణామాలు ఎలా ఉంటాయోన‌ని దేశ‌మంత త‌మిళ‌నాడు వైపు చూస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: