తమిళనాట శశికళ సీఎం కావడం తథ్యంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఆమె వెనుకే ఉండటం వల్ల కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా.. రాజకీయాలు నడిపినా శశికళదే ప్రస్తుతానికి పైచేయిగా కనిపిస్తోంది. ఆమెను ముఖ్యమంత్రిని చేయడం మినహా గవర్నర్ కు మరో ఆప్షన్ కనిపించడం లేదు. వేరే నిర్ణయాలు తీసుకుంటే విమర్శలపాలు కావడం తప్పదు. 

Image result for sasikala latest
ఈ నేపథ్యంలో ఏ సినిమా నటి మాత్రం శశికళపై యుద్ధం కొనసాగిస్తోంది. జయలలిత చనిపోయిన సమయంలో మొదటిసారి విచారణ జరిపించాలని గళమెత్తిన నటి గౌతమి ఇప్పుడు మరోసారి శశికళపై తీవ్ర ఆరోపలు చేస్తోంది. ఒక రాష్ట్రానికి లేదా దేశానికి అత్యున్నత పదవిని అధిష్ఠించే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేంటని సినీ నటి గౌతమి ప్రశ్నిస్తోంది. 

Image result for sasikala latest
చెన్నైలో ఆమె మాట్లాడుతూ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తికి కావాల్సిన అర్హతలేంటని నిలదీశారు. అవన్నీ శశికళకు ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు శశికళకు మద్దతు పలుకుతున్నవారంతా ఎన్నికలకు వెళ్లగలరా? ప్రజా తీర్పు కోరగలరా? అని ఆమె నిలదీశారు. తనను బలవంతంగా రాజీనామా చేయించారని ఒక ముఖ్యమంత్రి సూటిగా చెబితే... వెనుక ఎలాంటి కుట్రలు జరిగి ఉంటాయో ఊహిస్తే ఆందోళన కలుగుతుందని ఆమె అన్నారు. 

Image result for actress goutami

జయలలిత మరణం వెనుక నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని గౌతమి అన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేలే కొన్ని విషయాలు బయటపెడుతున్నారని, వాటిని ఎందుకు నమ్మకూడదో నిందితులు చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. జయలలిత స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆమె చెప్పారు. దీపా జయకుమార్ జయలలిత స్థానం భర్తీ చేయగలరని తాను భావించడం లేదని, ఆమె కాదు ఎవరూ జయలలిత స్థానాన్ని భర్తీ చేయలేరని ఆమె స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: