హిమాలయాల్లో హిడెన్ సిటీ గురించి చాలా విషయాలు విన్నాం.. అయినప్పటికీ శంభాలా నగరం విశిష్టత ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే. ఇప్పటికీ శంభాల గురించి పరిశోధకుల వెతుకులాట కొనసాగుతూనే ఉంది. కానీ 1920ల కాలంలోనే హిట్లర్ శంభాలపై కన్నేశాడు. శంభాల నుంచి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడు. హిట్లర్ హిమాలయాలకు ఎందుకొచ్చాడో తర్వాత తెలుసుకున్న ప్రపంచం నివ్వెరపోయింది.


శంభాలా నగరం గురించి అనేక గ్రంథాలు, యోగుల ద్వారా తెలుసుకున్న రష్యా 1920లో..రహస్యాన్ని ఛేదించేందుకు మిలటరీ ఫోర్స్ ను పంపి పరిశోధనలు చేయించింది. శంభాలా గురించి శోధించడానికి హిమాలయాలకు చేరుకున్న రష్యన్ మిలటరీ బలగాలకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఈ విషయం తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంభాలా గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్.. ఆ పుణ్యభూమి భువిపై ఏర్పడిన స్వర్గమని హిట్లర్ కు తెలియజేశాడు. ఆ యాత్రలో హిట్లర్  మానవ మాత్రులు కలలో కూడా ఊహించని అనుభవాలు, అనుభూతుల పొందాడని చెబుతారు.


అద్భుతాలు అంటే ఆసక్తి చూపించే హిట్లర్.. మంత్ర, యోగా విద్యలు కూడా నేర్చుకున్నాడట. ఆ ఆసక్తితోనే సంస్కృతం కూడా నేర్చుకున్నాడని ప్రతీతి. శంభాలా గురించి హిట్లర్ సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అందుకే తన జెండా గుర్తుగా స్వస్తిక్ ముద్రను వాడాడని చెబుతారు.


ప్రపంచం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని భావించిన హిట్లర్.. కొంతమంది ముఖ్యమైన అనుచరులతో కలిసి రహస్యంగా శంభాలా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడి ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడట. అయితే ఆధ్యాత్మికవేత్తలు హిట్లర్ తో విభేదించడంతో చేసేదేమీ లేక వట్టి చేతులతో వెనక్కు వెళ్లిపోయాడట. పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లెవెట్స్కీ ఈ విషయాలు చెప్పినప్పుడు ప్రపంచమే నివ్వెరపోయింది.


శంభాలా గురించి ఫ్రాన్స్ కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధ మత అభిమాని, రచయిత్రి అయిన అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ ఎన్నో గ్రంథాలు రచించింది. 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్న అలెగ్జాండ్రా.. వారి ద్వారా శంభాలా గురించి తెలుసుకొని అక్కడకు వెళ్లింద. అక్కడ మహిమాన్వితుల ఆశీస్సులు పొందడం వల్లే ఆమే ఏకంగా 101 సంవత్సరాలు బతికిందని చెబుతారు.

షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంభాలాపై చాలా పరిశోధనలు చేశాడు. శంభాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని ఆయన ప్రకటించాడు. అక్కడ ఉండేవారు టెలీపతి ద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతం వారితోనైనా మాట్లాడగలరు అని రాసుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా.. విధ్వంసం జరిగినా.. వారికి క్షణాల్లో తెలిసిపోతుందని పేర్కొన్నాడు. ఎనిమిది రేకుల భారీ కలువ పువ్వు ఆకారంలో శంభాలా నగరం ఉంటుందని డాక్టర్ లాయోసిన్ పేర్కొన్నాడు.


గత కాలపు శాస్త్రవేత్త లామా మింగ్యుర్ చెప్పిన దాన్ని బట్టి శంభాలా నగర వయస్సు అప్పటికి ఆరు మిలియన్ సంవత్సరాలు, అక్కడి ప్రజలు సుమారు 12 అడుగుల ఎత్తు ఉంటారట. దేవతలు ఆ ప్రాంతంలో సంచరిస్తారట. శ్రీ మహావిష్ణువు తన పదో అవతారమైన కల్కి రూపంలో అక్కడి నుంచే వస్తాడు అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: