తమిళ చిన్నమ్మ శశికళ సీఎం కల చెదరిపోయింది. రాణీవాసం కోరుకున్నశశికళకు కారాగార వాసం ఖరారయ్యింది. కానీ పన్నీర్ సెల్వానికి సీఎం కుర్చీ దక్కకూడదని పట్టుమీదున్న శశికళ శాసనసభాపక్షనేతగా పళనిస్వామిని ఎన్నిక చేయించింది. మరి 129 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో పళనిస్వామినే శశికళ ఎందుకు ఎంచుకుంది..


ఇంతకుముందు ఎప్పుడూ పెద్దగా పేరు వినిపించని పళనిస్వామి ఇప్పుడు హఠాత్తుగా సీఎం అభ్యర్థిగా ఎలా అవతరించాడు. అందుకు కారణాలేంటి.. పళనిస్వామి తమిళనాడులోని పెద్ద కులాల్లో ఒకటైన గౌండర్ కులానికి చెందినవారు. శశికళ తేవర్ కులానికి చెందినవారు. సొంత కులానికి కాకుండా మరో కులానికి ప్రాధాన్యం ఇచ్చిందన్న ఇమేజ్ కొట్టేయాలనుకుంటోంది శశికళ. 


శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం కూడా శశికళ కులమైన తేవర్ కు చెందినవారే. తిరుగుబాటుకు ముందు శాశనసభాపక్ష నేత, పార్టీ అధ్యక్షపదవి రెండూ తేవర్ కుటుంబానికే వచ్చాయన్న విశ్లేషణ వినిపించింది. అందుకే ఇప్పుడు సీఎం అభ్యర్థిని గౌండర్ కులాన్ని ఎంచుకున్నారు. 


అసంతృప్తిగా ఉన్న గౌండర్ల మద్దతు పొందడానికి పళనిస్వామిని సీఎం పదవికి ఎంపిక చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. పళనిస్వామి ఎంపికకు మరో కారణం. ఆయన పన్నీర్ సెల్వానికి బద్ద విరోధి కావడమే. ఓపీఎస్ గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయిన సమయంలోనూ పళనిస్వామి ఓపీఎస్ ను వ్యతిరేకించారు. అందుకే ఓపీఎస్ ను ఎదుర్కొనేందుకు పళినిస్వామిని ఎంచుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: