ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు దేశాన్ని కుదిపేసింది. తమిళనాట రెండు వారాలుగా సాగుతున్న డ్రామాకు తెరదించింది. చిన్నమ్మను చెరసాలకు పంపిస్తోంది. ఇక సీఎం రేసు నుంచి శశికళ తప్పుకోవడంతో ఓ పన్నీర్ సెల్వం, పళనిస్వామి సీఎం రేసులో మిగిలారు. మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. 


కానీ ఇక్కడే ఓ పాయింట్ తెరపైకి వస్తోంది. జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇతర నిందితులపై తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో జయపైనా ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయి. చెన్నైలో ఆమె నివాసమైన పోయెస్‌ గార్డెనే కుట్రకు స్థానమని మండిపడింది. పన్నాగమంతా అక్కడే రూపుదిద్దుకొందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 


ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. జయలలిత బతికి ఉంటే.. ఆమెకు కూడా కచ్చితంగా శిక్షపడి ఉండేది అనే విషయంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. ఒకవేళ్ల రెండు నెలల క్రితం జయలలిత అనారోగ్యంతో మరణించకపోయి ఉంటే.. ఏం జరిగేది.. ఆమె కూడా మళ్లీ జైలుపాలయ్యేది. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. సీఎంగా రెండోసారి ఎన్నికయ్యాక.. ఆమె కనీసం బయటకు కూడా రాలేదు. 


మరి ఇంతటి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమె చనిపోకుండా ఉండి ఉంటే.. ఆ సమయంలో ఈ తీర్పు వచ్చి ఉంటే.. తమిళనాట మరోసారి ఉద్విఘ్నవాతావరణం నెలకొనేది. అప్పుడు ఇదే మీడియా జయ అవినీతిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించేవి. జయ అవినీతి సీఎంగా అపఖ్యాతి పాలయ్యేది. సో.. జయలలిత రెండు నెలలముందే చనిపోవడం ద్వారా బతికిపోయిందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: