ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికా... భారత్ ఎదుట వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించింది. భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం చూసి ఫిదా అయింది. లక్ష్యాన్ని చూసి టెక్నాలజీలో తలపండిన దేశాలే.. మావల్ల కాదని చేతులెత్తేసిన తరుణంలో.. అతి సునాయసంగా భారత శాస్త్రవేత్తలు చేసి చూపారు. ఇండియా సాధించిన ఘనత చూసి అమెరికా కు చెందిన నేషనల్ ఏరోనాటికల్స్ అండే స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సెల్యూట్ చేసింది. 


అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలను పిఎస్ఎల్వీ-సి37 ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందుకు నాసా ఇస్రోకు అభినందనలు చెప్పింది. భారీ ప్రాజెక్టును సులువుగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురింపించింది. భవిష్యత్తులో పిఎస్ఎల్వీ ద్వారా మరిన్ని విజయ లక్ష్యాలు చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటించింది.  


బుధవారం ఉదయం 9గంటల 28నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ పిఎస్ఎల్వీ-సి37 వాహకనౌక 104 శాటిలైట్లను ఆకాశానికి మోసుకెళ్లింది. 22నిమిషాల్లో 524 కిలోమీటర్లు చేరుకుని ఆర్బిట్ లో విజవయంతంగా శాటిలైట్లను లాంచ్ చేసింది. దీంతో భారత కీర్తి పతాక మరోసారి ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. అంతరిక్ష గగనంలో భారత కీర్తి పతాకం రెపరెపలాడింది. శాస్త్ర సాంకేతిక రంగంలో, ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ల ప్రయోగంలో ఇండియాకు ఇస్రో మరోసారి తిరుగులేదని నిరూపించింది.

104 శాటిలైట్లు కక్ష్యలోకి చేరిన వెంటనే ఆయా దేశాల్లోని బేస్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపడం ప్రారంభించాయి. నాసా తన అంతరిక్ష చరిత్రలో.. ఇంత భారీ ప్రాజెక్ట్ చేపట్టే సాహసం చేయలేక పోయంది. టెక్నాలజీలో తమను మించిన వారు లేరనే, రష్యా, చైనా కూడా ఊహించడానికే భయపడ్డాయి. ఆ దేశాలన్నీ అసూయపడేలా సృష్టించిన ఈ ఘన చరిత్రను తిరగ రాయాలంటే.. అదీ మళ్లీ మన ఇస్రో కే సాధ్యం... 


మరింత సమాచారం తెలుసుకోండి: