పురచ్చి తలైవి జయలలిత సమాధి వద్ద నిచ్చెలి చిన్నమ్మ చేసిన శపథంలో మొదటి ఘట్టం విజయవంత మైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు సీఎం పీఠం దక్కకుండా చేశారు. శశికళ నమ్మిన బంటు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్నిగంటలకే బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. ఈనెల 18 తేదీనే అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు.. అదే రోజు బలాన్ని నిరూపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఇచ్చిన 15 రోజుల గడువును కేవలం రెండు రోజులకే కుదించి తన రాజకీయ చతురతను ప్రద ర్శించారు.
 
గవర్నర్‌ ఇచ్చిన 15 రోజుల సమయాన్ని సద్వి నియోగం చేసుకొని రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవచ్చని భావించిన సెల్వానికి సీఎం ఊహించని షాక్‌ ఇచ్చారు. శశికళ జైలుకు వెళ్లినా పన్నీర్‌కు పదవి దక్కకుండా చేసి తొలిపంతం నెగ్గించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జైలు కు వెళ్లే ముందే వ్యూహాత్మకంగా తన అనుచరులకు దిశా నిర్దేశం చేసి వెళ్లడం... ఆ తరువాత సీఎం, మంత్రులు ప్రమాణం చేయడంతో చిన్నమ్మ కారాగారం నుంచి ప్రభుత్వాన్ని నడపనుందని తేలిపోయింది. 

దాదాపు 20 సంవత్సరాలకు పైగా సాగిన జయలలిత అక్రమాస్తుల కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువ డింది. దేశంలోనే సంచలనం రేపిన ఈ కేసును 1996లో అప్పటి జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేశారు. ఆపై కేసు ఎన్నో ఆసక్తికర మలుపులు తిరిగింది. కేసులోని ముఖ్యాంశాలు. ప్రస్తుతం ఈయన తమిళ నాడులో బీజేపీ ఎంపీగా ఉన్నారు.

- 1996లో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది.
- డిసెంబర్ 7, 1996: అన్నాడీఎంకే నేత జయలలిత అరెస్ట్.
- ఏప్రిల్ 17, 1997: జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లపై 41 కేసులు - విచారణకు మూడు 
  కోర్టుల ఏర్పాటు.
- జూన్ 4, 1997: ఐపీసీలోని సెక్షన్ 120-బీ, అవినీతి నిరోధక చట్టం 1988లోని 13(2) రెడ్ విత్ 13(1)(ఇ) సెక్షన్ల కింద 
  కేసులు. చార్జ్ షీట్ దాఖలు.
- అక్టోబర్ 1, 1997: కేసును కొట్టివేయాలంటూ, మూడు పిటిషన్లను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు.
- ఫిబ్రవరి 5, 1999: ప్రత్యేక కోర్టులను రద్దు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్... ఆ ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు.
- మే, 2001: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం... సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 
   జయలలిత.
- సెప్టెంబర్ 21, 2001: సీఎం పదవి నుంచి తప్పుకున్న జయలలిత... సీఎంగా పన్నీర్ సెల్వం.
- నవంబర్ 2001: జయలలితను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.
- మార్చి 2, 2002: అండిపట్టి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయంతో మరోసారి పీఠమెక్కిన జయలలిత.
- నవంబర్ 2, 2002: అక్రమాస్తుల కేసులో విచారణ పునఃప్రారంభం.
- ఫిబ్రవరి 5, 2003: విచారణ సజావుగా సాగడానికి కేసును మరో రాష్ట్రానికి తరలించాలని డీఎంకే నేత అన్బళగన్ 
  పిటిషన్.
- నవంబర్ 18, 2003: కేసును కర్ణాటకకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.
- అక్టోబర్, నవంబర్ 2011: ప్రత్యేక కోర్టుకు పలుమార్లు హాజరై 1339 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన జయ.
- ఆగస్టు 14, 2012: స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగలేనని రాజీనామా చేసిన బీవీ ఆచార్య.
- ఫిబ్రవరి 2, 2013: భవానీ సింగ్‌ కు ప్రాసిక్యూటర్ బాధ్యతలు.
- ఆగస్టు 26, 2013: భవానీసింగ్‌ ను తప్పించిన కర్ణాటక ప్రభుత్వం.
- సెప్టెంబర్ 30, 2013: భవానీసింగ్‌ ను తప్పించడాన్ని తప్పుపట్టిన సుప్రీం... ఆదేశాలు రద్దు.
- ఆగస్టు 28, 2014: విచారణ పూర్తి... తీర్పు సెప్టెంబర్ 20కి వాయిదా.
- సెప్టెంబర్ 16, 2014: తీర్పును సెప్టెంబర్ 27కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రత్యేక కోర్టు.
- సెప్టెంబర్ 27, 2014: జయలలితను దోషిగా తేల్చిన కోర్టు, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 100 కోట్ల     
   జరిమానా.
- మే 11, 2015: కర్ణాటక హైకోర్టులో జయలలిత పిటిషన్... నిర్దోషిగా ప్రకటిస్తూ నిర్ణయం.
- జూలై, 2015: తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం.
- డిసెంబర్ 5, 2016: రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలో ఉన్న జయలలిత మరణం.
- ఫిబ్రవరి 14, 2016: నిందితులంతా దోషులేనని ప్రకటించిన సుప్రీంకోర్టు.


మరింత సమాచారం తెలుసుకోండి: