భారత ఆర్థిక వ్యవస్థను ధారుణంగా దెబ్బతీసేందుకు పాకిస్తాన్‌ మరో మాయోపాయం పన్నింది. పాక్ లోని ముష్కర మూకలు మళ్లీ నిద్రలేచి పన్నాగాలు పన్నుతున్నట్టు వార్తలు ఇబ్బడి ముబ్బడిగా వెలుగులోకి వచ్చాయి. గత నెల రోజుల్లోనే వెయ్యికోట్ల మేర నకిలీ కరెన్సీని రావల్పిండి కేంద్రంగా ముద్రించినట్టు భారత ఇంటిలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


rs.2000/- duplicates received in india from pak కోసం చిత్ర ఫలితం


పెద్ద మొత్తంలో రూ.2000/- నకిలీ నోట్లను ముద్రించి భారత్‌లోకి సరపరాకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారముందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. నోట్లు ముద్రిస్తున్న విధానం, పద్దతి ప్రకారం సరిహద్దులు దాటిస్తున్న తీరు చూస్తుంటే, నోట్లు తరలించేందుకు పాకిస్థాన్ కు చెందిన అమానుల్లా, ఖాలిక్‌‌ తో కూడిన నకిలీ రాకెట్‌ ఎంచు కున్న మార్గాలు కూడా చాలా విభ్రమం గొలిపేలా ఉన్నాయి. ఇందులో ఈ ఇద్దరు ప్రధాన సూత్రధారులకు పాకిస్తాన్ పాస్‌పోర్టు లిచ్చి, మరీ రావల్పిండిలో ముద్రించిన నకిలీనోట్లను ముందుగా దుబాయికి తరలించారు.


పాకిస్తాన్ నుంచి విమానంలో దుబాయికి చేరుకున్న ఈ ముఠా, అక్కడి నుంచి వేరే విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుంది. అక్కడి నుంచి భారత సరిహద్దుల వెంబడి కొన్ని కంచరగాడిద లను ద్వారా పశ్చిమబెంగాల్లోని “మాల్డా” లోకి ఈ నకిలి నగదును తరలించినట్లు తెలుస్తున్ది. ఈ మార్గమే కాకుండా శ్రీలంక, నేపాల్, థాయ్‌ల్యాండ్ మరియు మలేషియా దేశాల మీదుగా కూడా నకిలీ నోట్ల రవాణా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పాక్ ఎంచుకున్నట్టు ఇంటిలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.


mules at malda bangla boarder కోసం చిత్ర ఫలితం


ముందస్తు సమాచారం హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నప్పటికీ, పశ్చిమబెంగాల్ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించ డం పై ఫిర్యాదు చేసినట్టు ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా నకిలీ నోట్ల రవాణాకి "మల్డా మార్గం అడ్డా" గా మారిందని ఇంటిలిజెన్స్ అధికారులు ఫలు సందర్బాల్లో చెప్పినట్లు తెలుస్తుంది.


rs.2000/- duplicates received in india from pak కోసం చిత్ర ఫలితం


మరోవైపు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్కులు అన్నీ కలసి ఇప్పటికే రూ.2000/- నోటులోని సెక్యురిటీ ఫీచర్లను చాలావరకు కాపీ కొట్టగలిగాయని సమాచారం అధికారవర్గాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. రూ.2000/- నోటులో 17 వరకు సెక్యురిటీ ఫీచర్లు ఉండగా, డిసెంబర్లో దొరికిన నకిలీ నోట్లలో 6 వరకు, తాజాగా దొరికిన నోట్లలో 12 ఫీచర్లు వరకు కనిపించడంతో, నకిలీనోట్లు అచ్చం మన అసలు నోట్లలానే కనిపిస్తున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.


rs.2000/- duplicates received in india from pak కోసం చిత్ర ఫలితం


రూ.2000/- కావటంతో ఏమాత్రం మనదేశములోకి నకిలీ నోట్ల దాడి జరిగినా మన ఆర్ధిక వ్యవస్థ నవనాడులు కృసించక తప్పదు. పాకిస్థాన్లోని నకిలీ నోట్ల తయారీని మూలాల్లోనే సంధి కొట్టించకపోతే మన ఆర్ధిక వ్యవస్థ మరోసారి భ్రష్టు పట్టటం ఖాయం. పస్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి మాల్డాలోని భారత సరిహద్దులను బలపరచక పోతే భారీ నష్ఠం తప్పదు. 


malda bangla border కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: