ఆంధ్రప్రదేశ్ లో  నెల్లూరు రాజకీయాల్లో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు.  ఎప్పుడూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తారు  వివేకానందరెడ్డి.  తాజాగా ఆనవ వివేక్ కి ఘోర అవమానం జరిగిందని వార్తలు వస్తున్నాయి.  ఒకప్పుడు కాంగ్రెస్ లో వీర విధేయులుగా ఉన్న ఆనం బ్రదర్స్ తెలుగు దేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  అంతే కాదు గత కొంత కాలంగా ప్రతిపక్ష పార్టీని దుమ్ముదులుపుతూ చంద్రబాబుని పైకి ఎత్తుతూ వచ్చారు.  
రామనారాయణరెడ్డికి ఓకె.. తమ పరిస్థితేంటి?
అయితే  ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించి తెలుగుదేశం లో చేరిన నేత ఆనం  వివేకానందరెడ్డికి చేదు అనుభవం ఎదురైందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కలిసి ఎమ్మెల్సీ విషయం ప్రస్తావించినప్పుడు ఎవరికి ఏమి పదవులు ఇవ్వాలో తనకు తెలుసునని షాక్ ఇచ్చారట. అంతే కాదు మ్మకంతో పార్టీలోకి ఆహ్వానిస్తే, పార్టీకి  నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడినట్లు తెలిసింది. పార్టీలోకి ఆహ్వానించే ముందు ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇచ్చేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నారు.  

తాజాగా రెండు రోజుల అమరావతి పర్యటనలో చంద్రబాబును కలిసే అపాయింట్ మెంట్ దక్కించుకున్న ఆనం.. టీడీపీ తరుపున పొలిటికల్ బెర్త్ మాత్రం దక్కించుకోలేకపోయారట. ఆనం సోదరులు టీడీపీలో చేరి చ క్రం తిప్పుదామని ముందుగానే వ్యూహరచన చేశారు. రామ నారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్‌ , వివేకా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు, తనయడు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. బాబు ఆగ్రహంతో ఆనం సోదరుల ముందస్తు వ్యూహాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.    దీంతో టీడీపీలో అనవసరంగా చేరామని ఆయన తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: