హ్యాచరీస్‌లో కోడిపిల్లల ఎంపిక, పౌల్ట్రీఫామ్‌కు చేర్చే ప్రాసెస్‌ చూస్తే ఎవరైనా హమ్మా అంటారు. కఠినపాశాన హృదయమైనా కరిగిపోతుంది. నోరులేని జంతువు పడుతున్న మూగవేదన చూస్తుంటే కళ్లలో కన్నీటి సుడులు తిరుగుతాయి. మానవత్వం ఉన్న మనుషులెవరికైనా మనసు చివుక్కుమంటుంది.

అయితే ఇదంతా మగ కోడిపిల్లలు, అనారోగ్యంతో ఉన్న కోడిపిల్లల కన్నీటి కథ. ఇక.. ఆడపిల్ల అయిపోయి బతికిపోయిన కోడిపిల్ల కథ మరోలా ఉంటుంది. ప్రాణాలు దక్కించుకున్నా అవి పడే అవస్థలు అన్నీ ఇన్నీకావు. అలాంటి కోడిపిల్లలన్నీ ముందు మస్ట్‌గా ముక్కులు కట్‌ చేయించుకోవాలి. ఎందుకంటే పౌల్ట్రీలో కలిసివుండే కోళ్లతో కలహాలు రాకుండా.... ముక్కులతో పొడుచుకోకుండా.. ఎలాగోలా ఈ బాధను అణచుకున్నా ఆ తర్వాత అక్కడి కార్మికులు చేసే చర్యలతో ప్రాణాలు తీసినంత పనవుతుంది. అక్కడి సిబ్బంది ఇష్టానుసారంగా డ్రమ్ముల్లో, పెట్టెల్లో పడేస్తారు. కాళ్ల కింద తొక్కేస్తుంటారు. చేతులతో చిదిమేస్తుంటారు. మొత్తంగా అవీ ఒకరకమైన ప్రాణులేనని, వాటికీ తమలాగే ప్రాణం ఉందని గుర్తించరు. అందుకే అక్కడ నిత్యం జరిగే ఈ తంతును చూస్తే మనసు చివుక్కుమనక మానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: