భారత దేశంలో నల్లధనం నిర్మూలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  అప్పట్లో దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి..అంతే కాదు 50 రోజులు సామాన్యుల పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఏటీఎం, బ్యాంకుల వద్ద క్యూలు కడుతూ నానా బాధలు పడ్డారు.  మొత్తానికి కొత్త రూ.2000, రూ.500 నోట్ల వచ్చాక కాస్త ఊరట చెందారు.  ఇప్పుడు కొత్త నోట్లపై కూడా విమర్శలు వస్తున్నాయి..ఎన్న జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది అక్రమార్కులు కొత్త నోట్లు కూడా డుప్లికేట్ తయారు చేస్తున్నారు.
Image result for india new notes q line
తాజాగా  ఢిల్లీలోని సంగమ్‌విహార్‌ ప్రాంతంలోని ఎస్‌బిఐ ఎటిఎం నుంచే నకిలీ రూ. 2000 నోట్లు బయటికిరావడం కలకలం రేపింది. ఈ నోట్లపై 'భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ స్ధానంలో చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' అని, 'గ్యారంటీడ్‌ బై సెంట్రల్‌ గవర్నమెంట్‌ స్ధానంలో గ్యారంటీడ్‌బై చిల్డ్రన్స్‌ గవర్నమెంట్‌' అని ముద్రించారు. ఇటీవల ఓ కాల్‌సెంటర్‌ ఉద్యోగి సంగమ్‌ విహార్‌ ఎటిఎంలో రూ 8000 డ్రా చేయగా, మిషన్‌ నుంచి వచ్చిన నోట్లన్నీ నకిలీ విగా గుర్తించారు. దీనిపై ఆ ఉద్యోగి సమీప పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.
Image result for india new notes
దీన్ని నిర్ధారించుకునేందుకు ఓ కాని స్టేబుల్‌ స్వయంగా ఎటిఎంకు వెళ్లి విత్‌డ్రా చేయగా, నకిలీ నోటు రావడంతో కంగుతిన్నారు. ఎటిఎంలో నకిలీ నోట్లు జారీ కావడంపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన పోలీసు లు కేసును దర్యాప్తు చేస్తున్నారు.  ఇక వారికి వచ్చిన నోట్లు పింక్ కలర్లో ఉండటంతో వెంటనే గుర్తు పట్టడం కూడా కష్టమైంది.  అయితే ఆర్‌బిఐ నూతన నోట్లలో పొందు పరిచిన 17 సెక్యూరిటీ ఫీచర్లలో 11 ఫీచర్లను నకిలీనోట్ల తయారీదారులు కాపీ చేయగలుగుతున్నారని వెల్లడైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: