ప్రభుత్వశాఖలన్నీ ఒకొక్కటిగా ఆన్ లైన్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక శాఖలు ఆన్ లైన్ ద్వారా సేవలందిస్తుండగా.. తాజాగా జైళ్లశాఖ కూడా ఆకోవలోకి చేరి పోయింది. జైలులో ములాకత్ లు మరింత పారదర్శకంగా చేసేందుకు ఈ-ములాఖత్ లను జైళ్లశాఖ ప్రవేశ పెట్టింది. ప్రయోగాత్మకంగా చంచల్ గూడ జైల్లో చేపట్టిన కార్యక్రమాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రారంభించారు. 


ఇన్నాళ్లూ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలవాలంటే అదో పెద్ద ప్రహసనంగా ఉండేది. జైలు దగ్గరికి వెళ్లి, బారేడు లైన్లో నిలబడి, దరఖాస్తు చేసుకోవాలి. అప్పటికీ కలుస్తామన్న గ్యారెంటీ లేదు. జైల్లో మగ్గుతున్న తమ వారిని కలవడానికి బంధువులు నానా ఇబ్బందులు పడే వారు. అయితే అదంతా గతం. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అలాంటి కష్టాలకు తెలంగాణ జైళ్లశాఖ చెక్ పెట్టింది. ఇక మీద తాము కోరుకున్న సమయానికే జైల్లోని తమవారిని కలవొచ్చు. ఇంట్లో కూర్చునే.. డేటు, టైమ్ ఫిక్స్ చేసుకోవచ్చు. నేషనల్ ప్రిసన్ ఇన్ఫర్‌మేషన్ పోర్టల్ వైబ్ సైట్‌లో ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.


జైళ్ల శాఖ కూడా ఆన్ లైన్ కోవలోకి చేరిపోయింది. ములాకత్ ల విషయంలో పారదర్శకత కోసం.. ఈ-ములాకత్ లకు శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా చంచల్ గూడ జైల్లో ప్రారంభించింది. ఇకపై చంచల్ గూడ జైలులో ఉన్న ఖైదీలను ములాకాత్ అవ్వాలంటే.. ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ-ములాకాత్ ద్వారా ఖైదీలను ఈజీగా కలుసుకునే వెసులుబాటు ఉంటుంది. గతంలో ఖైదీలను కలవాలంటే ఎన్నో అవస్థలుండేవి... కొందరి చేతులు తడిపితే తప్ప... కలుసుకునే అవకాశం ఉండేది కాదు. 


దేశంలో ఎక్కడినుండేనా ఈ ములాకాత్ ద్వారా కలుసుకునే అవకాశం ఏర్పడింది. దూరం నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. జైల్లో ఉండే ఖైదీలతో పోలీసులు ప్రవర్తించే విషయంలో కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఖైదీలకు అనేక రంగాల్లో నైపుణ్య శిక్షణను ఇప్పిస్తూ... జైలు నుండి బయటకు వెళ్లిన వారికి ఉపాధి అవకాశాలు కూడా చూపిస్తున్నారు. శిక్ష అనుభవించిన వారిలో గొప్ప పరివర్తనను తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఈ  ఈ ములాకాత్ ల విధానం ద్వారా రోజుకు ఎంత మందిని కలుసుకునే అవకాశం ఇస్తారు? కలిసినవారు మళ్లీ ఎన్ని రోజులతరువాత కలుసుకునే వీలుంటుంది? అనే దానిపై మాత్రం జైళ్ల శాఖ క్లారిటీ ఇవ్వలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: