భారత దేశంలో నల్లధనం సమూలంగా నిర్మూలించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు కు శ్రీకారం చుట్టారు.   అయితే పాత 500, 1000 స్థానంలో కొత్తగా 500, 2000 నోట్లు ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు.  ఇక పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు..అయితే బ్యాంకుల్లో కొత్త నోట్లు రావడంతో కాస్త వెసులు బాటు లభించిందని అనుకున్నారు.  అయితే ఇప్పుడు దేశంలో నోట్ల విషయంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.  

ఇప్పటికే కొన్ని ఏటీఎం లో రెండు వేల రూపాయల స్థానం లో  దొంగనోట్లు, రంగు వెలిసిన నోట్లు వచ్చిన సంఘటనలు ప్రజలు ఇంకా మరచిపోక ముందే సీరియల్ నెంబర్ లేని నోట్లు పరేషాన్ చేశాయి.  వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో నారాయణ్‌ ఐర్వాల్‌ అనే స్కూల్‌ టీచర్‌కు స్థానిక ఏటీఎం నుంచి సీరియల్‌ నెంబర్‌లేని 500 రూపాయల నోట్లు వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఏటీఎం నుంచి వెయ్యి రూపాయలు డ్యా చేసుకోవడానికి ప్రయత్పించినపుడు ఈ నోట్లు వచ్చినట్టు ఆ టీచర్ తెలిపారు.  
Image result for q line atm
ఇలాంటి నోట్లు తనకు మాత్రమే కాదు తన తర్వాత వారికి కూడా ఇలాంటి నోట్లు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  ఇక తాజాగా రెండు వేల రూపాయ‌ల నోటు రంగు వెలిసిపోతూ జ‌నాన్ని భ‌య‌పెడుతోంది. రితిక్‌ గుప్తా అనే వ్యక్తి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంకు వెళ్లి రూ.10 వేలు తీయగా ఐదు రూ.2,000 నోట్లు వచ్చాయి. వాటిలో ఒక దాని రంగు పోతోందని రితిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అది దొంగనోటు కాదనీ, రంగు పోతున్నట్లుగా ఫిర్యాదు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: