2017-18 ఆర్థిక బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌నలో అధికారులు ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. సచివాలయంలోని డీ బ్లాక్‌ మూడో  ఫ్లోర్‌లోని ఆర్థిక విభాగంలో  బడ్జెట్‌ రూప కల్పనలో అధికారులు తలమునకలై ఉన్నారు. రానున్న బడ్జెట్ లో సంక్షేమమే కీలకమని, అణగారిన వర్గాలను ఆదరించే పద్ధతిలోనే బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాలు రెండూ ఉన్నా.. బడ్జెట్‌ పరిమాణం గతం కంటే పెరుగుతుందన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానం సాధించిందన్నారు. దానికి 2,3 రెట్లు ఎక్కువగా ప్రణాళికలు ఉన్నాయన్నారు. 


అయితే ఈ సారి మాత్రం  సంక్షేమానికే బడ్జెట్లో పెద్దపీట వేయనున్నారు. బీసీలు, ఈబీసీలు సహా వివిధ వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చినా.. రానున్న బడ్జెట్లో సంక్షేమమే కీలకమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలను ఆదరించే పద్ధతిలోనే బడ్జెట్‌ ఉంటుందని స్పష్టం చేశారు. గొర్రెల పెంపకంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కూడా ఈ దిశగానే సిఫారసు చేసింది. రాష్ట్రంలో 4 లక్షల యాదవ, కురుమ కుటుంబాలు ఉన్నాయని, వాటిలో 2 లక్షల కుటుంబాలకు ఈ ఏడాది 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీకి సిఫారసు చేసింది. 

అలాగే, మిగిలిన 2 లక్షల కుటుంబాలకు వచ్చే ఏడాది యూనిట్లు పంపిణీ చేయాలని సిఫార్సు చేస్తోంది. వీటి పంపిణీలో అసలు గొర్రెలు లేని వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక్కో గొర్రెల యూనిట్‌లో 20 ఆడ గొర్రెలు, ఒక గొర్రె పోతు ఉంటాయి. ఉపసంఘం సిఫారసుల మేరకే ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ పై తుది నిర్ణయం జరగనుంది.  గొర్రెల పెంపకందార్ల సొసైటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రస్తుత సహకార చట్టం ప్రకారం విధివిధానాలను ప్రతి సొసైటీ పాటించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. 

గొర్రెల పెంపకం లబ్ధిదారుల ఎంపికకు ఉన్న మార్గదర్శకాలకూ కొన్ని సవరణలను మంత్రివర్గ ఉపసంఘం సూ చించింది. గొర్రెల పెంపకంపై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన నిధుల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని సిఫారసు చేసింది. గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, కొను గోలు చేసిన ప్రాంతంలోనే వాటికి బీమా ట్యాగ్‌నూ వేయాలని సూచించింది. గొర్రెలను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ, రాజస్థాన రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని సూచించింది. 

కాగా.. గొర్రెల కొనుగోలులో కేజీల లెక్కన ధర నిర్ణయించాలని, రాష్ట్రస్థాయిలో టెండర్లనూ పిలవాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. టెండర్‌ను దక్కించుకున్న వారే వాటిని లబ్ధిదారుల గ్రామాల వరకూ సరఫరా చేయా లని స్పష్టం చేసింది. అలాగే, మత్స్య శాఖకు సంబంధించి సొసైటీల సభ్యత్వాల నమోదు, ఇతర అంశాలపైనా ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: