జగన్ యువ నాయకుడు.. బహుశా దేశంలోనే అతి తక్కువ వయసున్న ప్రతిపక్ష నాయకుడు కూడా కావచ్చు. అసలే యువరక్తం. అందులోనూ చేతికి అందినట్టే అందకుండా పోతున్న సీఎం సీటు.. పాపం అందుకనే.. జగన్ లో అసంతృప్తి తరచూ బయటపడుతూ ఉంటుంది. ఆ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరచడంలో ఆయన ఏమీ వెనక్కు తగ్గడు కూడా. 


మొన్నటికి మొన్న విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులపై జులుం చేశారు.. అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టను.. మీ సంగతి చూస్తా అంటూ మీడియా ముందే బెదిరించేశాడు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మృతుల పోస్టుమార్టం విషయంలోనూ అధికారులపై ఫైర్ అయ్యాడు జగన్. డ్రైవర్ శవానికి పోస్టు మార్టం జరపకపోవడాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నించిన జగన్ ఆ సమయంలో సంయమనం కోల్పోయాడు. 



వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. ఏకంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ను నువ్వు జైలుకుపోతావు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చేశాడు. సాధారణంగానే జగన్ అంటేనే మీడియాకు ఆసక్తి. అందులోనూ ఇలాంటి నెగిటివ్ వార్త దొరికితే వదిలి పెడుతుందా.. ప్రింటు, ఎలక్ట్రానిక్ , వెబ్ మీడియా అంతా రచ్చ రచ్చ చేస్తాయి. దీంతో జగన్ ఓవరాక్షన్ సాక్షి మీడియాను తెగ ఇబ్బంది పెడుతోంది. 


జగన్ ఇలా సంయమనం కోల్పోయినప్పుడల్లా ఆ వార్తలు రాయడం సాక్షి సిబ్బందికి కత్తిమీద సాములా మారుతోంది. ఉన్నది ఉన్నట్టు రాయలేరు. ఏ మాత్రం తేడా వచ్చినా తమ అధినేతకు ఇబ్బంది వచ్చేస్తుంది. అలాగనీ మిగిలిన మీడియా మొత్తం ఇచ్చిన దానికి వ్యతిరేకంగానూ రాయలేరు. అందుకే తమ అధినేత ప్రవర్తనను సమర్థిస్తూ.. వెనకేసుకొస్తూ వార్తలు రాయలేక తెగ ఇబ్బందిపడతారు. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ను బెదిరించిన వార్త కూడా సాక్షి పత్రికలో చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. పాపం.. సాక్షి విలేకరులకు ఎన్ని తిప్పలో..



మరింత సమాచారం తెలుసుకోండి: