ఏ రంగంలో రాణించినా చివ‌ర‌కు అంద‌రూ రాజ‌కీయాల్లోకి వెళ్తున్నారు. ఈ తంతూ ఇప్ప‌టి నుంచి కాదు గ‌త 60 ఏళ్లుగా ఉంది. కానీ తాజాగా ఈ సంస్కృతి మ‌రింత పెరిగింది. కానీ తాజాగా బ్యాడ్మింట‌న్ క్రీడాకార‌ణి గుత్తా జ్వాల సైతం త్వ‌ర‌లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాన‌ని చెప్ప‌డం పెను  సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అది జ‌న‌సేన పార్టీలో నుంచి ఎంపీగా పోటీలోకి దిగుతాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. '2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను.. అసెంబ్లీకి వెళతాను..' అంటూ ఇప్పటికే పలుమార్లు జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ 'క్లారిటీ' ఇచ్చిన విషయం విదితమే. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పలు అంశాలపై జనసేన పార్టీ తరఫున 'సర్వేలు' కూడా జరుగుతు న్నాయట. 


ఈ విషయాన్నీ పవన్‌కళ్యాణే సెలవిచ్చారు. ఏ పార్టీకి అయినా, ఇలాంటి సర్వేలు తప్పనిసరి. అయితే, జనసేన చేయిస్తున్న వాటిల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించే ఎక్కువ సర్వేలు జరుగుతున్నాయట. మొత్తం మీద వ‌చ్చే ఎన్నిక‌ల‌ వార్‌కి జ‌న‌సేన పూర్తి స్థాయిలో స‌మాయ‌త్త‌మ‌వుతోంది. అటు ఏపీతో పాటు, తెలంగాణ‌లోనూ జ‌న‌సేన పోటీ ఖ‌రారైంది. దీంతో జ‌న‌సేన‌లో టిక్కెట్ల‌పై క‌న్నేసిన ప‌లువురు ఇప్ప‌టినుంచే ఖ‌ర్చీఫ్‌లు వేసేస్తు న్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు త‌మ‌కి కావాలంటూ ప‌బ్లిక్ వేదిక‌ల‌పై బ‌హిరంగంగానే ప్ర‌క‌టించేస్తున్నారు.

ప్రస్తుతానికైతే జనసేన పార్టీ నిర్మాణం అనేదానిపై ఎలాంటి స్పష్టతా లేదు. 'నాయకులు కావలెను..' అంటూ మొన్నీ మధ్యనే గుంటూరులో ఓ బహిరంగ సభలో పాల్గొన్న పవన్‌కళ్యాణ్‌, నాయకుల కోసం పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి స్పందించి పలువురు నేతలు, జనసేన పార్టీతో టచ్‌లోకి కూడా వచ్చారు. అయితే, జనసేన అంటే ప్ర స్తుతానికి పవన్‌కళ్యాణ్‌ మాత్రమే. పవన్‌కళ్యాణ్‌ ఓ పక్క సినిమాలతో బిజీగా వుంటున్నారాయె. దాంతో, పవన్ ని  కలిసే నేతలకింకా జనసేన పార్టీ మీద ఓ క్లారిటీ రాని పరిస్థితి. 

మరోపక్క, జనసేన పేరుతో కొందరు మీడియాలో అప్పుడప్పుడూ కన్పిస్తున్నారు. అందులో దిలీప్‌ అనే వ్యక్తి కూడా ఒకరు. మొన్నటికి మొన్న విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ యువత ప్రత్యేక హోదా కోసం మౌన దీక్షకు పిలుపు నిస్తే, ఆ దీక్షకు పవన్‌కళ్యాణ్‌ మద్దతిచ్చారు. ఆ సమయంలో జనసేన పార్టీ తరఫున హడావిడి చేసినవారిలో ఈ దిలీప్‌ ముఖ్యుడు. మీడియాలో జనసేన పార్టీని బాగానే వెనకేసుకొచ్చాడు. ఇంకో రెండేళ్ళలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా పార్టీని సంస్థాగతంగా నిర్మించడమంటే చిన్న విషయం ఏమీ కాదు. నేతలదేముంది.? టిక్కెట్ల పోరులో, అప్పటికి లీడింగ్‌లో వున్న పార్టీలు కాదంటే, జనసేన పార్టీ వైపు నేతలు పరుగులు పెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు.

కానీ, రాజకీయ పార్టీ అన్నాక సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు కొన్ని వ్యూహాలుండాలి కదా.? అక్కడే జనసేనకు పెద్ద సమస్య వచ్చిపడ్తోంది. ఇప్ప‌టికే ఏపీలో కొంద‌రు మంత్రులు జ‌న‌సేన‌లోకి జంప్ చేస్తార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు జ‌న‌సేన‌లో చేరేందుకు ప‌వ‌న్‌కి గాలం వేస్తున్నారు. వీళ్ల‌తో పాటు ప్ర‌ముఖ క్రీడాకారులు జ‌న సేన లో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇప్ప‌టికే జ‌న‌సేన‌కు నా మ‌ద్ధ‌తు ఉంటుం ద‌ని తెలిపారు. టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేష్ సైతం జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేస్తాన‌ని, ప‌వ‌న్ సీటిస్తే రెడీ అని ప్ర‌క‌టించారు. 


2019లో గెలుపు జ‌న‌సేనానిదేన‌ని అన్నాడు బండ్ల‌. ఇప్పుడు తాజాగా ఓ లేడీ క్రీడాకారిణి త‌న అభిప్రాయాన్ని హాట్‌గా వెలిబుచ్చారు. త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్ ఎంట్రీకి రెడీ అవుతున్న బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప‌వ‌న్ జ‌న‌సేన అంటే ఇష్ట‌మ‌ని ప్ర‌క‌టించారు. సికింద‌రాబాద్ నుంచి ఎంపీ అవ్వాల‌న్న‌ది త‌న చిర‌కాల వాంఛ ను బ‌య‌టపెట్టారు. ప్ర‌స్తుత ఊపు చూస్తుంటే జ‌న‌సేన బెర్తుల‌న్నీ ఫిల్ అయిపోతే ఎలా? అనుకుంటున్న వాళ్లం తా ఇలా ఓపెన్ అయిపోతున్నారు. మ‌రి గుత్తాని ప‌వ‌న్ దృష్టిలో పెట్టుకుంటారా? ఎంపీని చేస్తారా? వేచి చూడా ల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: