Related image



మన ఇరుగు పొరుగులతో మనకు సఖ్యత లేదు. దీనికి గత 70 సంవత్సరాలుగా భారత్ ను పాలించిన కాంగ్రేస్ పార్టీయే నని నిర్ద్వందంగా చెప్పవచ్చు. కనీసం మాల్దీవ్స్ విషయములో బిజెపి విధానమూ సరికాదు.


Image result for maldives map


దక్షిణాసియా దేశమైన మాల్దీవులు 26 ద్వీపాల సమూహం. ఆ ద్వీపాల్లో "ఫాఫు"  అనే ఒక ద్వీపాన్ని అమ్మకానికి పెట్టింది మాల్దీవుల ప్రభుత్వం. దీంతో మాల్దీవులకు అతి చేరువలో ఉన్న భారత్‌కు ఇరుగుపొరుగులో మరో భద్రతా సమస్య ఏర్పడి నట్లే. మాల్దీవుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అబ్దుల్లా యమీన్‌ ప్రభుత్వం సౌదీ అరేబియాకు 'ఫాఫు' అనే ద్వీపాన్ని అమ్మాలని యోచిస్తోంది. 


Image result for maldives map


ఈ విషయంపై మాట్లాడిన మాల్దీవుల్లోని ప్రతిపక్ష మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ దేశంలో 'వహబిజం' ను దేశంలో మరింత విస్తరింపజేసే విధంగా ఉందని పేర్కొంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా ఓ పరాయి దేశానికి భూమిని అమ్మడానికి ప్రభుత్వం వెనకాడటం లేదని తెలిపింది. 


 Image result for maldives kingdom


గతంలో ఇతర దేశస్థులకు మాల్దీవుల్లో భూమిని అమ్మితే వారిని ఉరి తీసేవారు. ఆ నిబంధనలను 2015 లో చేసిన రాజ్యంగా సవరణ ద్వారా సడలించారు. అతి తక్కువ భూభాగం కలిగి ఉండే మాల్దీవుల్లో విదేశీయులకు భూమిని అమ్మడాన్ని అక్కడి ప్రజలు కూడా నిరసిస్తున్నారు. ఫాఫుద్వీపం కొనుగోలు గురించి సౌదీరాజు అతిత్వరలోనే మాల్దీవుల పర్యటనకు రానున్నారు.


మాల్దీవుల్లో సౌదీకి భూమిని అమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి.  సౌదీ ప్రతి ఏటా 300మంది మాల్దీవియన్లకు విద్యకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లను అంద జేస్తుంది. ఇప్పటికే 70 శాతం మందికిపైగా మాల్దీవియన్లు 'వహబిజము" ను స్వీకరించారు. 


Image result for maldives map

 
భారత్‌కు చుట్టూ ఉన్న పొరుగుదేశాల్లో భారత  ప్రధానమంత్రి పర్యటించని ఒకే ఒక దేశం కూడా మాల్దీవులే. మాల్దీవుల్లోని అంతర్గత వ్యవహారాల కారణంగా భారత ప్రభుత్వం వారితో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడలేదు. కానీ, ఇకపై ఆ దేశంతో సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరాన్ని తాజా పరిస్ధితులు కల్పించాయి. వచ్చే ఏడాది మాల్దీవుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు ధృడమయ్యే అవకాశాలు ఉన్నాయి.


Image result for maldives map

మరింత సమాచారం తెలుసుకోండి: