దూరపు కొండలు నునుపు కావచ్చు, కానీ అమెరికా దూరపు కొండలు గరు కేనన్న సంగతిని ట్రంప్‌ పదవీ స్వీకారం తరువాతే మనం గ్రహించామను కుంటే పొరపాటు. ఇటీవలి దశాబ్దాలలో కూడా ఇలాంటి హత్యాకాండ అమెరికాలో సాగిందన్న వాస్తవాన్ని గుర్తించాలి. గడచిన పదిన్నరేళ్ల కాలంలోనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సహా, భారత విద్యార్థులు 1,064 మంది జాత్య హంకారంతో జరిపిన దాడులలో బలయ్యారు. ట్రంప్‌ అధ్యక్షుడైన తరు వాత విద్య, ఉద్యోగాల కోసం అమెరికాను ఆశ్రయించిన ఆసియా, ఆఫ్రికా దేశాల యువతపై దాడులు మరింత పెచ్చరిల్లిపోయాయి. 


ఒక వారం లేదా పది రోజుల వ్యవధిలోనే ఇలాంటి దాడులకు బలైన, కాకుంటే క్షతగాత్రు లైన వారి సంఖ్య నాలు గు. తాజాగా సిక్కు యువకుడు దీప్‌రాయ్‌ పైన నిన్నగాక మొన్న (మార్చి 5) కాల్పులు జరిగాయి. ఆయన కోలు కుంటున్నారు. ఈ ఘటన తరువాత అప్పుడు తెలుగు సంఘాల మాదిరిగానే ఇప్పుడు సిక్కు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఆకస్మిక  దుష్పరిణామాన్ని తిప్పి కొట్టగల శక్తి పరాధార స్థితిలో ఉన్న స్వతంత్ర భా రత పాలకులకు కరువైపోయింది. కనీసం ఇంతమంది భారతీ యుల్ని పొట్టనపెట్టుకుంటున్న జాత్యహంకార ధోరణికీ, అమెరికన్‌ పాలనా విధానాలకూ నిరసనగానైనా బలమైన గొంతును విన్పించలేని దుస్థితి భారత పాల కులది. 

కారణం..? అమెరికా పాలకులు ‘టెర్రరిజం’ బూచిని చూపి, ‘మేం ప్రపంచంలో ఎవరిని, ఏ దేశాన్ని టెర్రరిస్టు దేశం అని ప్రకటిస్తామో ఇతర దేశాల నాయకులు కూడా అదే విధానానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే వారినీ, వారి దేశాలనూ కూడా మేం టెర్రరిస్టులుగా ప్రకటిస్తాం’ అని సీని యర్‌ జార్జిబుష్‌ లగాయతూ  హెచ్చరించారు. ఆ క్షణం నుంచీ భారత దేశం లోని సాత్విక పాలకులూ, దుందుడుకు పాలకులూ అమెరికా నినాదాన్నే అందు కున్నారు. టెర్రరిజం టెర్రరిజం నుంచే పుడుతుంది, ఫాసిజం ఫాసిజం నుంచే తలెత్తుతుంది. ఈ వాతావరణం ఇన్ని వేలమంది మన యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉంది.

అమెరికా పాలకుల అనర్థదాయక ప్రకటనలు పంపుతున్న  తిరకాసు సంకేతాలను స్వతంత్ర భారత పాలకులు గా కరాఖండిగా ఖండించలేకపోతున్నారు. పైగా ట్రంప్‌ విధానాలకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ వత్తాసు పలు కుతున్నారు. ఇందుకు కారణం, ఆర్థిక సంస్కరణల పై మనం బేషరతుగా సంతకాలు చేసి ఉండ డమూ, ఆ షరతులనుంచి దూరం కాలేక పోవడమూనని గ్రహించాలి. ఇందుకు తాజా ఉదాహరణ–‘ఇండియాతో సంబం ధాల విషయంలో ట్రంప్‌ పాలకవర్గం సానుకూల వైఖరితోనే ఉందని’ మన విదేశాంగ కార్యదర్శి ఎస్‌. జయ శంకర్‌ వాషింగ్టన్‌ నుంచి (4.3.17) ప్రకటించడం. 

ఆయన ఈ నిర్ణయానికి ఎలా వచ్చారు? ట్రంప్‌ వైఖరి మనకు సానుకూలంగా ఉంటుందని ఏ భారమితితో కొలి చారు? ట్రంప్‌ కూడా అమెరికా ఇతరుల మీద దిగుమతు లపై ఆధారపడకుండా ఎగుమతుల్ని పెంచుకునేం దుకు దేశీయ వస్తూత్పత్తి రంగాన్ని (మాన్యుఫాక్చరింగ్‌) పటిష్టం చేయాలనుకుంటున్నారు.ఇక్కడ ‘ఇండియా లోనే తయారీ’ (మేక్‌ ఇన్‌ ఇండియా) అని మోదీ కూడా నినాదం అందుకున్నారు. కాబట్టి ఉభయుల ఆదర్శాలూ ఏకీభవిస్తున్నాయి. 

ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు యథావిధిగానే ఉంటాయన్నది జయశంకర్‌ అభిప్రాయం. కానీ ట్రంప్‌ ప్రకటనలు మన స్వతంత్ర ఆర్థిక మూలాలకు, సాంకేతిక పురోగతికి ప్రపంచబ్యాంక్‌ ప్రజా వ్యతిరేక విధానాల ఆసరాతోనే ఎసరు పెడుతున్నాడన్న మౌలికమైన గ్రహింపు లేకపోవడమే జయశంకర్‌ ప్రకటనకు ప్రధాన కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: