ఖాతాదారులు కాస్తైనా నిల్వలు తమ ఖాతాలలో ఉంచుకోక పోతే అపరాధ రుసుము కింద డబ్బులు వసూలు చేస్తాం అంటూ బ్యాంకులు తీసుకున్న కొత్త నిర్ణయం మీద అనేక నిరసనలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యి కొన్ని రోజుల పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ లు సైతం బ్యాన్ చెయ్యాలి అనే మాటకి వచ్చేసారు జనాలు సైతం. ఈ ప్రభావం చూసి మోడీ ప్ప్రభుత్వం భయపడుతోంది కూడా. దేశం లో ఏది జరిగినా జనం మైండ్ అంతా మోడీ మీదనే ఉంటుంది అంతటి ఫాలోయింగ్ ఉన్న మోడీ ఆయన ప్రభుత్వం ఇప్పుడు దీనికి సంబంధించి డామేజ్ కంట్రోల్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచీ ఎస్బీఐ ఈ కొత్త నిబంధన తెసుకుని వచ్చింది.


ఇప్పటికే విజయ్ మాల్యా ని వదిలేసి అతని ఆస్తులని సైతం జప్తు కూడా చెయ్యలేకపోయారు అనే అపవాదు ఈ ప్రభుత్వం మీద పడిపోయింది ఎప్పుడో. అసలే పెద్ద నోట్ల రద్దు అపవాదు నుంచి ఇంకా బయట పడలేక నానా కష్టాలూ పడుతున్న మోడీ ప్రభుత్వానికి ఈ రకమైన తలనొప్పులు కొత్త కష్టాలు తెస్తున్నాయి. సో జాగ్రత్తగా ఇలాంటివి జనాలలో తమమీద వ్యతిరేకత పెంచే లోగా తగ్గించాలి అని కోరుకుంటూ  స్పందించిన కేంద్రం అపరాధ రుసుము వసూలుపై పునరాలోచించాలని బ్యాంకులను కోరింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐకి లేఖ రాసింది. 


క్యాష్ డిపాజిట్ ల నుంచీ ఏటీఎం విత్ డ్రా వరకూ రుసుముల లెక్కలు పెంచేయడం తో ఐదుసార్లు మాత్రమే atm లో ఫ్రీగా విత్ డ్రా చేసుకునే పరిమితి వచ్చింది. ప్రతీ విత్ డ్రా మీద పది రూపాయలు చార్జీ లు వేస్తున్నాయి బ్యాంకులు.ఐతే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడుసార్లకు మాత్రమే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత  ఒక్కో ట్రాన్సాక్షన్  పై 20 రుపాయలు ఛార్జీ వసూలు చేయనున్నారు. దాంతో పాటు నగదు డిపాజిట్లను మూడుకు తగ్గించారు. మినిమం బ్యాలన్స్ ఉండకపోతే వంద రూపాయల వరకూ ఫైన్ వసూలు చేస్తారు. ఏప్రిల్ 1 నుంచీ ఈ లెక్క అమలు లోకి వస్తుంది. యూపీ ఎన్నిల నేపధ్యం లో ఈ వార్తలు జనం లో మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుతున్నాయి. దాంతో కేంద్రం రంగంలోకి దిగి డ్యామేజీ కంట్రోల్ చేస్తోంది..


కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో ఉన్న ఎస్ బీఐకి నిర్ణయాన్ని అమలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఆఫ్ స్క్రీన్ లో మోడీ స్వయంగా బ్యాంకులకి వాటి పెద్దలకీ క్లాసు పీకుతున్నారు అనీ , ప్రభుత్వాన్ని అస్తిరత్వం వైపు తోసేసే నిర్ణయాలు తీసుకోకండి అంటూ ఆయన సీరియస్ అయినట్టు సమాచారం .


మరింత సమాచారం తెలుసుకోండి: