వివాదాస్పద వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న న‌గ‌రి ఎమ్మెల్యే,  వైసిపి నేత రోజా నిత్యం ఏదో ఒక వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకి ఎక్కుతారు. అందుకే ఆమెతో పెట్టుకోవాలంటే ఏపీ లో ఏ నాయ‌కుడు ముందుకు రారు. అందుకే అసెంబ్లీలో ఆమె చేసిన వ్యాఖ్య‌లకు ఏడాది పాటు స‌స్పెండ్ చేశారు. అయితే తాజాగా   మరో మారు సంచ లన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతోనే ఆ పార్టీ కి గడ్డు కాలం మొదలైందని రోజా అన్నారు. 


ఈ విషయాన్నీ తనకు ఒక జ్యోతిష్యుడు చెప్పి నట్లు రోజా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేసారు. లోకేష్ నామినేషన్ అలా వేశాడో లేదో.. ఇలా చంద్రబాబు కు ఓటుకు నోటు కేసులో సుప్రీం నుంచి నోటీ సులు వచ్చాయని,  దీనిని బట్టే టిడిపి కి బ్యాడ్ టైమ్ మొదలైందని అర్థమవుతోందని రోజా అన్నారు. ఏడాది కాలం అసెంబ్లీలో అడుగుపెట్టకుండా రోజా సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే.  ఏడాది పూర్తవడంతో రోజా తిరిగి అసెంబ్లీలోకి ప్రవేశించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ శశికళ, ఏపీ ట్రంప్ గా పేర్కొనవచ్చని రోజా మరో మారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చిన్న చిన్న సాకులతో కేసులు పెట్టిస్తున్నారని రోజా ఆరో పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అనిత ను దూషిం చారంటూ రోజాపై ఆరోపణలు ఉండటం.. ఆమెపై ఏడాది సస్పెన్షన్ ను విధించటం తెలిసిందే. 

తనపై విధించిన సస్పెన్షన్ గడువుముగియటంతో అసెంబ్లీకి వచ్చిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నట్లు స‌మ‌చారంతో అంద‌డం తో.. రోజా రియాక్ట్ అయ్యారు. సభాధ్యక్షుడైన స్పీకర్ కు తెలికుండా.. ఆయనకు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ వీడియో ఎలా బయటకు వచ్చింది?అని ప్రశ్నిస్తు న్నారు రోజా. తాను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నఆమె.. తాను చేశానని చెబు తున్న వ్యాఖ్యల్ని.. అక్కడక్కడా కట్ చేసి.. వీడియో తయారు చేశారే తప్పించి.. పూర్తి వీడియో చూస్తే అసలు విషయం అర్థమవుతుందన్నారు.

స్పీకర్ కు తెలీకుండా మీడియాకు వీడియోలు లీక్ చేసిన మంత్రి కాల్వ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని.. కానీ.. అలా చేయటం లేదని వ్యాఖ్యానించారు. తనపై మరోసారి సస్పెన్షన్ విధిస్తే.. తాను సుప్రీంకోర్టుకు వెళతాన ని వెల్లడించారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని.. వీడియో మొత్తాన్ని విడుదల చేస్తే అసలు విషయం ప్రజలకు అర్థమవుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: