సాధారణంగా చిన్న పిల్లలు మారాం చేస్తుంటే వాళ్లకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి బుజ్జగిస్తుంటాం.  మరీ కొంత మంది పిల్లు బాగా మారం చేస్తే ఎత్తుకొని షీకారుకెళ్తాం...వారికి ఇష్టమైనవి చూపించి ఎడుపు అగేలా చేస్తాం.  కానీ ఓ పాప మాత్రం తనకు బీరు కావాలని మారాం చేస్తుంది..ఇంతకీ ఆ పాప వయసెంతో తెలుసా..నిండా రెండు సంవత్సరాలు కూడా ఉండవు.  ఇలాంటి వింత సంఘటనలన్నీ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో ప్రత్యక్షమవుతున్నాయి.  

తాజాగా ఓ పాప తన తండ్రి బీరు తాగుతుంటే..బీరు కావాలని ఏడుస్తుంది..సరే అని కాస్త బీర్ పట్టించి వద్దూ..పాలు తాగాలని పాల పీక నొటి వద్ద ఉంచితే వద్దూ..బీరే కావాలని మారం చేస్తుంది.  సరే అని బీరు నొటి వద్ద పెడితే ఏడుపు ఆపుతూ..బీరు తాగుంది..మరోసారి పాల పీక నొటి వద్ద ఉంచితే..వద్దు పొమ్మంటూ ఏడుస్తుంది.  మొత్తానికి పాలకు బదులు ఈ పాప బీరు ఎంచక్కా తాగేస్తుంది.  

మొత్తానికి ఈ వీడియో చూసి పాప‌కు అంటుకున్న ఈ అల‌వాటు ప‌ట్ల నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.  ఆ చిన్నారికి బీరును అలవాటు చేసిన తండ్రికి చీవాట్లు పెడుతున్నారు.  ప్రస్తుతం యూ ట్యూబ్‌లో ఒక‌రు ఉంచిన ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: