ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంత గొప్పగా గెలిచిందో అంతే అద్భుత మైన విజయం పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ సాధించింది. పంజాబ్‌లో అకాలీ– బీజేపీ సంకీర్ణం పదేళ్ళుగా అధికారంలో ఉండటం, అకాలీ పార్టీ, ప్రభుత్వంపై ఒకే ఒక్క కుటుంబ పెత్తనం ఉండటం, అక్కడ బీజేపీ చిన్న భాగస్వామి కావడం, మత్తుపదార్థాల బెడద, అవి నీతి చెద, వ్యవసాయ సంక్షోభం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌ అత్యంత ప్రధానమైనది. తర్వాత స్థానం పంజాబ్‌ది. ఉత్తరాఖండ్‌ది మూడో స్థానం. గోవా, మణిపూర్‌లు చిన్న రాష్ట్రాలు.  


కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మధ్య ఇంత అంతరం ఉంటుందని ఏ సర్వే కూడా అంచనా వేయలేదు. రెండు పార్టీలకూ చెరి 55 సీట్లు ఇచ్చిన సర్వేలే ఎక్కువ. 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆప్‌కు 20, అకాలీ–బీజేపీ జోడీకి 18 స్థానాలు వచ్చాయి. ఆప్‌లో అసమ్మతి, అరాచకం ఇందుకు కొంతవరకూ కారణం. పంజా బ్‌ గ్రామీణ ప్రాంతంలో జాట్‌ సిక్కులు అకాలీదళ్‌ను పూర్తిగా విడిచిపెట్టకపోవడం కూడా అకాలీల స్థానాలు గౌర వ ప్రదమైన స్థాయిలో రావడానికీ, ఆప్‌కు ఆశాభంగం కలగడానికీ దారితీసి ఉండవచ్చు. 2014లో పంజాబ్‌ నుంచి నలుగురు ఆప్‌ అభ్యర్థులు పార్లమెం టుకు ఎన్నికైతే, కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ సభ్యులు ముగ్గురే. 

కానీ  నలుగురు ఆప్‌ లోక్‌సభ సభ్యులలో ఇద్దరిని సస్పెండ్‌ చేయగా, ఒక సభ్యుడు ఆరోగ్యం బాగాలేదనే మిషతో ఇల్లు కదలలేదు. ఒక్క భగవంత్‌ మన్‌ మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా శాసనసభకు పోటీ చేశారు. పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ సామర్థ్యం, ప్రాబల్యం, అకాలీల పట్ల ప్రబలిన ప్రతి కూలత, ఆప్‌ నాయకుల అనుభవ రాహిత్యం, అనైక్యత  కలిసి కాంగ్రెస్‌కు చారి త్రక విజయం సాధించిపెట్టాయి. ఇందు లో పార్టీ అధిష్ఠానం పాత్ర పెద్దగా లేదు. చాలా జాప్యం తర్వాత, పార్టీ నుంచి వైదొలుగుతానంటూ సంకేతాలు పంపిన అనంతరం అమరిందర్‌సింగ్‌ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి అంగీకరిం చడం ఒక్కటే పార్టీ 

ఈ ఫలితాలు దేనికి సంకేతం? 2019లో మోదీకి ఎదురు ఉండబోదని చెప్పగ లమా? 2014 నాటి ఫలితాలనే 2019 లో సైతం మోదీ నాయకత్వంలోని బీజేపీ సాధించగలదా? 2014లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ మోదీ సుడిగాలి పర్యటనలు చేసి, ఎన్నికల సభలలో మన్మోహన్‌ ప్రభుత్వాన్నీ, కాంగ్రెస్‌ పార్టీని నిర్దయగా తూర్పార బట్టారు. యూపీలో ఎస్‌పీ ప్రభుత్వం శాంతిభద్రతల పరి రక్షణలో, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో ఘోరంగా విఫలమైనదంటూ ఎండగట్టారు. మోదీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు అనుకున్నారు. ఇచ్చారు. 

యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు.  ప్రజలు మోదీని నమ్మారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రసాదించారు. 2019 లో దేశ వ్యాప్తంగా కానీ, యూపీ లాంటి ముఖ్యమైన పెద్ద రాష్ట్రంలో కానీ ప్రతికూల ప్రచారం చేసే అవకాశం మోదీకి ఉండదు. ఆ అవకాశం రాహుల్‌ గాంధీకీ, అఖిలేశ్‌ యాదవ్‌కీ, మాయావతికీ, ఇతర ప్రతిపక్ష నాయకులకూ ఉంటుంది.ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పుడు కాంగ్రెసేతర పక్షా లన్నీ ఒకే తాటి మీదకు వచ్చినట్టు, 1967లో చౌధరీ చరణ్‌సింగ్‌ నాయకత్వంలో యూపీలో సంయుక్త విధాయక్‌ దళ్‌ పేరుతో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని సీపీఎం నుంచి భారతీయ జన సంఘ్‌ వరకూ అన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి నిలబెట్టినట్టు ఉత్తరోత్తరా బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమష్టి కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉంది. 

అటువంటి సంఘటనకు కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందో లేదా మరో పార్టీ నాయకత్వం వహిస్తుందో ఇప్పుడే  చెప్పడం కష్టం. పంజాబ్‌ విజయంతో కాంగ్రెస్‌కు కొంత గౌరవం పెరిగింది.  కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ పుంజుకుంటే బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష  కూటమికి నాయకత్వం వహించే అవకాశం కాం గ్రెస్‌కు దక్కుతుంది. ప్రజలలో ఎన్నో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపో తున్నా మోదీ ప్రభుత్వం సాధించిన ఘన విజయం కానీ చేసిన గట్టి మేలు కానీ ఇంతవరకూ ఏదీ లేదు. కాంగ్రెస్‌ బలహీనతే బీజేపీ బలంగా భావించవలసి వస్తున్నది. 

తాను ఏమి చేసిందీ అయిదేళ్ళ తర్వాత 2019లో లెక్కలు చెబుతానంటూ మోదీ చాలా సభలలో ప్రకటించారు. ఇక ప్రతిపక్షాల ప్రశ్నలకూ, సాధారణ ప్రజల సందేహాలకూ సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మోదీదే. కేంద్రంలో, ముఖ్యమైన అన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు కానీ మిత్రపక్షాల ప్రభుత్వాలు కానీ ఉంటాయి కనుక ప్రతిపక్షాలను నిందించి పబ్బం గడుపుకునే అవకాశం లేదు. ఇక వచ్చేది మోదీకి పరీక్ష కాల‌మేన‌న్న‌ది నిర్వివివాదాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: