గ‌త బ‌డ్జెట్ కంటే ఈ సారిను భారీగానే పెంచడ‌మే కాకుండా ప్ర‌ధాన‌మైన రంగాలలో బ‌డ్జెట్ పెంచి శ‌భాష్ అనిపించుకుంది తెలంగాణ సర్కార్‌. 2016-17 గానూ బ‌డ్జెట్ 1ల‌క్ష 15 వేల‌ కోట్ల బ‌డ్జెట్ గా ఉండ‌గా ఈ సారి ఏకంగా 1.49,446 కోట్లు పెంచేశారు. అయితే కొన్ని రంగాల‌లో బ‌డ్జెట్ ను పెంచి కొన్ని రంగాల‌కు బ‌డ్జెట్ ను త‌గ్గించారు. ఓవ‌రాల్ గా చూసుకుంటే ఈ సారి మాత్రం అన్ని రంగాల‌లో బ‌డ్జెట్ నిధులు పెంచేశారు. ఇక‌పోతే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల ప్రస్తావన లేకుండా, ప్రగతి, నిర్వహణల పేరిట 2017-18 తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ ముందుంచారు
 
బ‌డ్జెట్ లోని ముఖ్యాంశాలు:
 మొత్తం బడ్జెట్ విలువ రూ. 1,49,446 కోట్లు. 
 నిర్వహణా వ్యయం రూ. 61,607 కోట్లు.
 ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు.
 ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు.
 ఎస్టీల అభివృద్ధికి రూ. 8,125 కోట్లు.
 ఈ ఏడాదితో రైతు రుణమాఫీ పూర్తి.
 రుణమాఫీకి రూ. 4 వేల కోట్ల కేటాయింపు.
 వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 46,946 కోట్లు.
 వ్యవసాయ రంగానికి రూ. 5,942.97 కోట్లు.
 హరిత వనానికి రూ. 50 కోట్లు.
 పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు.
 విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు.
 ఐటీ రంగానికి రూ. 252 కోట్లు.
 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు.
 శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు.
 పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ. 198 కోట్లు.
 మిషన్ భగీరథకు రూ. 3 వేల కోట్లు.
 జర్నలిస్టులకు రూ. 30 కోట్లు.
 జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు.
 రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు.
 వచ్చే రెండేళ్లలో 4 లక్షల మంది యాదవులకు 84 లక్షల గొర్రెల పంపిణీ.
 75 శాతం రాయితీతో గొర్రెల పంపిణీ.
 నాయీ బ్రాహ్మణులకు రూ. 500 కోట్లు.
 రజకులకు రూ. 500 కోట్లు.
  గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు.
 పాఠశాల విద్యకు రూ. 12,705 కోట్లు.
 చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 1,200 కోట్లు.
  ఇకపై పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 75,116
  ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులకు వచ్చే మహిళలకు రూ. 12 వేల సాయం.
 మూడు విడతలుగా రూ. 4 వేల చొప్పున సాయం.
 ఆడపిల్ల పుడితే మరో రూ. 1000 అదనం.
  'కేసీఆర్ కిట్' పథకానికి రూ. 605 కోట్లు.
  మహిళా శిసు సంక్షేమానికి రూ. 1,731 కోట్లు.
 ఎంబీసీల అభివృద్ధికి రూ. 1000 కోట్లు.
 మైనారిటీలకు రూ. 1,249 కోట్లు కేటాయింపు.
 బీసీ సంక్షేమానికి రూ. 5,070 కోట్లు.
 పంచాయతీ రాజ్ కు రూ. 14,723 కోట్లు.
  బ్రాహ్మల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు.
 వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,976 కోట్లు.
 ఫీజు రీఎంబర్స్ మెంట్ కు రూ. 1,939 కోట్లు.
 బీసీ విద్యార్థుల కోసం కొత్తగా 119 గురుకుల పాఠశాలలు.
 మైనారిటీల కోసం 201 గురుకులాలు.
 సైనిక సంక్షేమ నిధి ఏర్పాటు.
 సైనిక కుటుంబాలకు డబుల్ పెన్షన్ అవకాశం.
 ఆసరా పింఛన్ కోసం రూ. 5,330 కోట్లు.
 పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు.
  మూసీ నది ప్రక్షాళన కోసం రూ. 350 కోట్లు.
 ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు రూ. 200 కోట్లు.
 రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ లకు రూ. 400 కోట్లు.
 12 శాతానికి చేరిన ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా.
 రూ. 75 వేల కోట్లను దాటిన ఐటీ ఎగుమతుల విలువ.


మరింత సమాచారం తెలుసుకోండి: