గ్రామీణ ఆర్థిక ప్రగతిని లక్ష్యంగా ఎంచుకొని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,49,646 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. రెండేళ్ల ముందే ఎన్నికల బడ్జెట్‌ను ఆవిష్కరించి నట్లుగా భారీగా వరాల జల్లు కురిపించింది. వ‌ల‌స‌ బాట పట్టిన తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష...’ అంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ ఏ దిశగా పయనించిందో చెప్పారు. ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన సాగునీటికి వరుసగా రెండోసారి బడ్జెట్‌లో ప్రభుత్వం సింహభాగం నిధులు కేటాయించింది.
 
కోటి ఎకరాల తెలంగాణ మాగాణాన్ని ఆవిష్కరించే సంకల్పానికి మరోసారి ప్రాధాన్యమిస్తూ.. సాగునీటి ప్రాజెక్టుల కు రూ.25 వేల కోట్లు ప్రతిపాదించింది. తొలిసారిగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ పేరుతో నవ జాత శిశువులకు ‘కేసీఆర్‌ కిట్‌’ కార్యక్రమాన్ని బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన బిడ్డలకు, తల్లులకు మొదటి మూ డు నెలల కు అవసరమయ్యే 16 వస్తువులతో ఈ కిట్‌ను సమకూర్చుతారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించటం గమనార్హం. 

మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండింతలకు పెంచింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు రూ.12 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనపు ప్రోత్సాహకం ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటా యించింది. 
బడ్జెట్‌కు ముందే.. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, వీఆర్‌ఏలు, వీఏవోల జీతాల పెంచుతు న్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బడ్జెట్‌లో అందుకు తగిన వాటాను సమకూర్చారు.

ఇప్పటికే పేద కుటుం బాల ఆదరణ చూరగొన్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలకు ఆర్థికసాయాన్ని రూ.75,116కు పెంచింది. దీనికి బడ్జెట్‌లో రూ.850 కోట్లు కేటా యించింది. ఆసరా ఫించన్లకు ఈ ఏడాది నిరుటి కంటే ఎక్కువగానే రూ.5,330 కోట్లు, ఆఖరి విడత రైతుల రుణమాఫీ పథ కానికి రూ.4 వేల కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.4,484 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.2,600 కోట్లు బడ్జెట్‌లో పొందుప రిచింది. గత ఏడాది సీఎం అధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) పేరుతో రూ.4,800 కోట్లు కేటాయించి న ప్రభుత్వం ఈసారి దాన్ని రూ.1000 కోట్లకు కుదించటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: